Site icon HashtagU Telugu

Bhatti Vikramarka : జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసిన డిప్యూటీ సీఎం

Deputy CM Bhatti Vikramarka released the job calendar

Deputy CM Bhatti Vikramarka released the job calendar

Bhatti Vikramarka: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో జాబ్‌ క్యాలెండర్‌(Job Calendar)ను ప్రవశపెట్టారు. సంవత్సరంలో ప్రభుత్వం చేపట్టబోయే ఉద్యోగ నోటిఫికేషన్, ఎగ్జామ్‌ తేదీలతో కూడిన జాబ్‌ క్యాలెండర్‌ను ప్రకటించారు. గత ప్రభుత్వంలో ప్రశ్నాపత్రాల లీకేజీ వల్ల విద్యార్థులు, అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని.. పేపర్ లీక్ కారణంగా రెండుసార్లు గ్రూప్-1 రద్దయ్యిందని భట్టి విక్రమార్క అన్నారు. ఉద్యోగుల భర్తీ అంశంలో అధికారులతో రెండు కమిటీలు వేశారని.. ఇప్పటి వరకు 32 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం.. మరో 13వేల ఖాళీలను గుర్తించామని డిప్యూటీ సీఎం అన్నారు. విద్యార్థుల ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని పోటీ పరీక్షలను వాయిదా వేశామని.. 2024-25 జాబ్ క్యాలెండర్ ప్రకటన చేస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

నోటిఫికేషన్లు.. పోస్టుల భర్తీ ఇలా..

1.సింగరేణిలో పలు ఉద్యోగాల కోసం వచ్చే ఏడాది జులైలో నోటిఫికేషన్.. నవంబర్‌లో పరీక్షలు

2. వచ్చే ఏడాది జులైలో గ్రూప్‌-3 నోటిఫికేషన్ నవంబర్‌లో పరీక్షలు

3. వచ్చే ఏడాది మేలో మరోసారి గ్రూపు2 నోటిఫికేషన్.. అక్టోబర్‌లో పరీక్షలు

4. డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకులు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ పోస్టులకు వచ్చే ఏడాది జూన్‌లో నోటిఫికేషన్..సెప్టెంబర్‌లో పరీక్షలు

5. ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో నోటిఫికేషన్ విడుదల చేసి ఆగస్టులో పరీక్షలు నిర్వహిస్తారు

6. గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్ష వచ్చే ఏడాది జులైలో నిర్వహించనున్నారు

7. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ .. మేలో పరీక్షలు

8. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల .. ఏప్రిల్‌లో పరీక్షలు

9. వివిధ శాఖల్లో గెజిటెడ్ ఉద్యోగాల కోసం వచ్చే ఏడాది జనవరిలో నోటిఫికేషన్ విడుదల.. ఏప్రిల్‌లో పరీక్షలు

10. నవంబర్‌లో టెట్ నోటిఫికేషన్ విడుదల చేసి వచ్చే ఏడాది జనవరిలో పరీక్షలు

11. ట్రాన్స్‌కోలోని వివిధ ఇంజినీరింగ్ ఉద్యోగాల కోసం అక్టోబర్‌లో నోటిఫికేషన్.. వచ్చే ఏడాది జనవరిలో నియామక పరీక్షలు

12. వైద్యఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ ఆఫీసర్ నియామకాల కోసం సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ విడుదల… నవంబర్‌లో పరీక్షలు.

అయితే అందులో ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తారనే సమాచారం లేకపోవడంతో బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం తెలిపారు. తొలి ఏడాదిలో 2లక్షల ఉద్యోగాల సంగతి ఏంటని కేటీఆర్ ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్‌పై సభలో చర్చించాలని బీఆర్ఎస్‌ పట్టుబట్టగా.. కేవలం ఇది మంత్రివర్గం తీసుకున్న స్టేట్‌మెంట్ మాత్రమే అని చర్చ ఉండదని భట్టి వివరణ ఇచ్చారు.

Read Also: Telangana Assembly : ‘నీ అమ్మ ముసుకో’ అసెంబ్లీ లో దానం బూతు పురాణం