Site icon HashtagU Telugu

Deputy CM Bhatti : రాష్ట్ర ఆర్థిక మంత్రుల సమ్మేళనంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి

Deputy CM Bhatti participated in the meeting of state finance ministers

Deputy CM Bhatti participated in the meeting of state finance ministers

State-finance-ministers-association: తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 16వ ఆర్థిక సంఘం రాష్ట్ర ఆర్థిక మంత్రుల సమ్మేళనంలో పాల్గొన్నారు. రాష్ట్రాలకు న్యాయమైన వాటాలో నిధులు అందడం లేదని దీర్ఘకాలంగా వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాలతో పాటు పంజాబ్ అభిప్రాయాలను కూడా తెలుసుకునేందుకు కేరళ రాజధాని తిరువనంతపురం లో గురువారం కాంక్లేవ్ నిర్వహించారు.

Read Also: BJLP Meeting : అసెంబ్లీలో బీజేఎల్పీ భేటీ.. కీలక నిర్ణయాలు, డిమాండ్లు ఇవే

కేరళ సీఎం అధ్యక్షతన తమిళనాడు, కర్ణాటక, కేరళ, పంజాబ్, రాష్ట్రాల ఆర్థిక మంత్రులు హాజరయ్యారు. రాష్ట్రాలు వసూలు చేసి కేంద్రానికి అందిస్తున్న పన్నుల ఆదాయంలో తిరిగి రాష్ట్రాలకు 41 శాతం మాత్రమే అందుతున్నదని, దీన్ని కనీసంగా 50 శాతానికి పెంచాలని పలు రాష్ట్రాలు 16వ ఫైనాన్స్ కమిషన్‌కు నివేదించాయి. అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను 16వ ఫైనాన్స్ కమిషన్ సేకరిస్తున్నందున న్యాయమైన వాటకోసం ఒత్తిడి పెంచేలా పలు రాష్ట్రాలు ఈ కాంక్లేవ్‌లో పాల్గొన్నాయి.

కేరళ నిర్వహించే ఈ సమావేశం రాష్ట్రాలు గణనీయమైన అభివృద్ధి మరియు ఆర్థిక అడ్డంకులను ఎదుర్కొంటున్న క్లిష్ట సమయం  అని కేరళ ఆర్థిక మంత్రి కెఎన్ బాలగోపాల్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. డాక్టర్ ఎ అరవింద్ పనగారియా అధ్యక్షత ప్రధాన లక్ష్యం అని ప్రకటన పేర్కొంది.

Read Also: T20 World Cup Ticket Prices: 115 రూపాయలకే మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ క‌ప్ టిక్కెట్లు..!