Site icon HashtagU Telugu

Vijay Nair : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు..విజయ్ నాయర్‌కు బెయిల్

222

Delhi Liquor Scam Case..Bail for Vijay Nair

Delhi liquor scam case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఢిల్లీ మొదలుకుని గల్లీ వరకూ ఎన్ని అరెస్టులు జరిగాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఢిల్లీ లిక్కర్ కేసులో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న విజయ్ నాయర్‌కు బెయిల్ మంజూరైంది. సోమవారం మధ్యాహ్నం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగిన తర్వాత నాయర్‌కు బెయిల్ మంజూరు చేయడం జరిగింది.

We’re now on WhatsApp. Click to Join.

కాగా.. విజయ్ నాయర్ ఆమ్ ఆద్మీ పార్టీ మీడియా కమ్యూనికేషన్ ఇంచార్జీగా ఉన్నారు. ఇదిలా ఉంటే.. లిక్కర్ కేసు ప్రారంభం దశలోనే నవంబర్-2022లో విజయ్ నాయర్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. పాలసీ విషయంలో నిందితులతో అనేకసార్లు భేటీ అయినట్లు ఆరోపణలు రాగా.. ఈడీ విచారణలో ఇది నిజమే అని తేలింది. ఆ మధ్య ఆరోగ్య సమస్యలతో బెయిల్‌పై బయటికి వచ్చారు. ఆ తర్వాత సీబీఐ కేసులో రెగ్యులర్ బెయిల్ పొందినప్పటికీ.. ఈ ఏడాది జనవరిలో మధ్యంతర బెయిల్ వచ్చే వరకూ ఈడీ కస్టడీలోనే ఉన్నారు. అప్రూవర్‌గా మారిన దినోశ్ అరోరా 12వ స్టేట్మెంట్‌లో లిక్కర్ పాలసీలో నాయర్ పాత్రేంటి..? అనేది పూసగుచ్చినట్లుగా చెప్పినట్లు అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. కాగా.. విజయ్ నాయర్ సుమారు 23 నెలలకు పైగానే జైలులో ఉన్నారు.

మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇలా పెద్ద తలకాయలు అరెస్ట్ కావడంతో ఒక్కసారిగా దేశ రాజకీయాలు హీటెక్కాయి. ఈ కేసులో నిందితులను కొన్ని రోజులపాటు సీబీఐ, ఈడీ దర్యాప్తు సంస్థలు విచారించడం, అరెస్టులు చేసి తీహార్ జైలుకు తీసుకెళ్లడం అన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే ఈ స్కామ్‌లో చాలా మంది అప్రూవర్లగా మారడంతో బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే. మరికొందరు ఢిల్లీ హైకోర్టు, రౌస్ అవెన్యూ కోర్టు, సుప్రీంకోర్టుల మెట్లెక్కి బెయిల్ తెచ్చుకోవడం జరిగింది. ఇలా ఒక్కొక్కరుగా నిందితులు బెయిల్‌పై బయటికొచ్చేస్తున్నారు. ఈ మధ్యనే కల్వకుంట్ల కవిత బెయిల్‌పై తీహార్ జైలు నుంచి బయటికొచ్చిన సంగతి తెలిసిందే. అంతకుముందు ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చింది.

Read Also: Operation Bhediya : ‘ఆపరేషన్ భేడియా’ ఫెయిల్.. మరో చిన్నారిని చంపేసిన తోడేలు