Kavitha: ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు(Rouse Avenue Court)లో బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు(Kavitha) చుక్కెదురయింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు(Delhi Liquor Policy Case)లో తనను సీబీఐ అరెస్ట్( CBI Arrested) చేయాడాన్ని సవాల్ చేస్తూ ఆమె రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై వాదనలు విన్న కోర్టు ఆమె పిటిషన్లను కొట్టి వేసింది. తనను అరెస్ట్ చేయడం, తనను ప్రశ్నించడం రెండు అంశాలపై ఆమె రెండు పిటిషన్లు వేశారు. ఈ రెండు పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. మరోవైపు, కవితను ఐదు రాజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలనే పిటిషన్ పై కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. ఈ పిటిషన్ పై తీర్పును జడ్జి రిజర్వ్ లో పెట్టారు. కాసేపట్లో తీర్పును వెలువరించనున్నారు. ఒకవేళ కవితను కోర్టు కస్టడీకి ఇస్తే… ఆమెను సీబీఐ కార్యాలయానికి తరలిస్తారు.
We’re now on WhatsApp. Click to Join.
అంతకు ముందు తీహార్ జైలు నుంచి రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టుకు కవిత చేరుకున్నారు. జడ్జి ముందు కవితను సీబీఐ ప్రవేశపెట్టింది. ఐదు రోజుల కస్టడీని సీబీఐ కోరింది. కవితను విచారించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని కోర్టుకు సీబీఐ తెలిపింది. కవిత సీబీఐ కస్టడీపై తీర్పును రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి రిజర్వ్ చేశారు. దీంతో కవితని కోర్టు రూం నుంచి తీసుకెళ్లారు అధికారులు.
Read Also: Rajamouli- David Warner: డేవిడ్ వార్నర్‌తో జత కట్టిన రాజమౌళి.. దేని కోసం అంటే..?
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవిత కీలక పాత్రను పోషించారని వారు కోర్టుకు తెలిపారు. సౌత్ గ్రూప్, ఆప్ పార్టీ మధ్య జరిగిన రూ. 100 కోట్ల లావాదేవీల్లో కవితది ప్రధాన పాత్ర అని వారు చెప్పారు. కవితను లోతుగా విచారిస్తేనే వివరాలు బయటకు వస్తాయని తెలిపారు. కవిత వాట్సాప్ చాట్ వివరాలను కోర్టుకు సీబీఐ అధికారులు అందించారు. కోర్టులో ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి. న్యాయమూర్తి కావేరి బవేజా వాదనలను వింటున్నారు. కవితను సీబీఐ కస్టడీకి కోర్టు ఇస్తుందా? లేదా? అనే ఉత్కంఠ నెలకొంది.