Site icon HashtagU Telugu

Medha Patkar : పరువునష్టం కేసు..మేధా పాట్కర్‌ అరెస్టు

Defamation case.. Medha Patkar arrested

Defamation case.. Medha Patkar arrested

Medha Patkar : ఓ పరువునష్టం కేసులో సామాజిక కార్యకర్త, ‘నర్మదా బచావో ఆందోళన్’ ఉద్యమకారిణి మేధా పాట్కర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవ‌ల ఆమెపై నాన్ బెయిల‌బుల్ వారెంట్ జారీ అయిన విష‌యం తెలిసిందే. 24 ఏళ్ల క్రితం నాటి ప‌రువున‌ష్టం కేసులో మేధా పాట్క‌ర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రొబేష‌న్ బాండ్ల‌ను ఆమె స‌మ‌ర్పించ‌లేదు. 2000 సంవ‌త్స‌రంలో పాట్క‌ర్‌పై కేసు న‌మోదు అయ్యింది. అయితే బుధ‌వారం ఢిల్లీ కోర్టు ఆ కేసులో నాన్ బెయిల‌బుల్ వారెంట్ జారీ చేసింది. ఇటీవ‌ల ఆమెపై నాన్ బెయిల‌బుల్ వారెంట్ జారీ అయిన విష‌యం తెలిసిందే. 24 ఏళ్ల క్రితం నాటి ప‌రువున‌ష్టం కేసులో మేధా పాట్క‌ర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రొబేష‌న్ బాండ్ల‌ను ఆమె స‌మ‌ర్పించ‌లేదు.

Read Also: Pahalgam Terror Attack : పహల్గామ్ ఉగ్రదాడిలో మరో ఆసక్తికర ఘటన వెలుగులోకి

2000 నాటి ఈ కేసును ప్రస్తుత ఢిల్లీ ఎల్‌జీగా ఉన్న వీకే సక్సేనా దాఖలు చేశారు. ఈక్రమంలోనే శుక్రవారం పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను కోర్టు ముందు హాజరుపరచనున్నారు. కేసులో రెండు వారాల పాటు స్టే ఇవ్వాల‌ని పెట్టుకున్న పాట్క‌ర్ అభ్య‌ర్థ‌న‌ను కోర్టు కొట్టివేసింది. గుజ‌రాత్‌లోని ఓ ఎన్జీవో కు ఎల్‌జీ స‌క్సేనా అధినేత‌గా ఉన్న స‌మ‌యంలో మేధా పాట్కార్ తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. అత‌నో పిరికివాడు అని, హ‌వాలా కుంభకోణానికి పాల్ప‌డిన‌ట్లు మేధా పాట్క‌ర్ ఆరోపించారు.

కాగా, 2000 సంవత్సరం నుండి మేధా పాట్కర్, వీకే సక్సేనాల మధ్య న్యాయపోరాటం కొనసాగుతుంది. నర్మదా బచావో ఆందోళన్‌కు వ్యతిరేకంగా ప్రకటనలు ప్రచురించారని, దాని కారణంగా వీకే సక్సేనా అప్పట్లో ఆమెపై కేసు పెట్టారు. ఆ సమయంలో వీకే సక్సేనా అహ్మదాబాద్‌లోని ‘నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్’ అనే ఎన్జీవోకు చీఫ్‌గా పనిచేస్తున్నాడు. ఇక, ఓ టీవీ ఛానెల్‌ ఇంటర్వ్యూలో తనను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడంతోపాటు పరువునష్టం కలిగించేలా పత్రికా ప్రకటన జారీ చేశారని ఆరోపిస్తూ పాట్కర్‌పై వీకే సక్సేనా సైతం రెండు కేసులు దాఖలు చేశారు. ఈ క్రమంలో రెండు ప్రతిపక్షాల మధ్య న్యాయపోరాటం కొనసాగుతూ, పరువునష్టం, పరస్పర ఆరోపణలతో కొత్త దశలో ప్రవేశించింది.

Read Also: Pahalgam Terror Attack : వినయ్ నర్వాల్ భార్యపై అసభ్యకర కామెంట్స్.. అరెస్ట్