Tirupati : టెట్రా ప్యాక్ సహకారంతో దళిత్ బహుజన్ రిసోర్స్ సెంటర్ ( DBRC) “ఎన్ హేన్సింగ్ యాక్సెస్ టు ఎన్ టైటిల్మెంట్స్, లైవ్లీ హుడ్స్, హెల్త్ అండ్ ఎన్వైరన్ మెంటల్ సస్టైనబిలిటీ” ప్రాజెక్ట్ ను తిరుపతిలో ప్రారంభించింది. వ్యర్థాలు ఏరుకునే ప్రజల ఉన్నతి లక్ష్యంగా ప్రారంభించబడిన ఒక కొత్త కార్యక్రమం. ఈ పనివారు నగర వ్యర్థాల నిర్వహణలో మరియు రీసైక్లింగ్ వ్యవస్థలో కీలకమైన బాధ్యతవహిస్తారు. కానీ తరచుగా ఆర్థికపరమైన సమస్యలు, సాంఘిక మినహాయింపులను ఎదుర్కొంటున్నారు. మరియు అవసరమైన సేవలను పరిమితంగా మాత్రమే పొందుతున్నారు.
Read Also: Online Betting : రాష్ట్రాలు ఆన్‌లైన్ బెట్టింగ్ పై చట్టాలు చేయొచ్చ: కేంద్రం
జీవనోపాధి పెంపుదల వ్యర్థాలను ఏరుకునేవారి ప్రాథమిక జీవనోపాధిని శక్తివంతం చేయడానికి ట్రైసైకిల్స్ కేటాయించడం. మరియు ప్రత్యామ్నాయ ఆదాయం-ఉత్పన్నం చేసే కార్యకలాపాలను మద్దతు చేయడానికి పుష్ కార్ట్స్ కేటాయించడం, సంపాదనలు మరియు సామర్థ్యాన్ని పెంచడం. పిల్లలకు విద్యాపరమైన మద్దతు, పిల్లలకు జీవన నైపుణ్యాలు కలిగించడం, సానుకూలమైన అలవాట్లు కలిగించడం, మరియు వారిని అధికారిక విద్యలోకి చేర్చుకోవడం వంటివి చేయడానికి అవుట్ డోర్ లెర్నింగ్ సెంటర్స్ (OLCలు)ను ఏర్పాటు చేయడం. ఆరోగ్యం మరియు సామాజిక భద్రత ఆరోగ్య పద్ధతులను మెరుగుపరచడానికి చైతన్య కార్యక్రమాలను నిర్వహించడం మరియు ప్రభుత్వ హక్కులు పొందడానికి సమన్వయం చేయడం.
శిక్షణ మరియు సామర్థ్యపు రూపకల్పన: వృత్తిపరమైన ఆరోగ్యంపై శిక్షణను అందించడం, సామాజిక భద్రతా పథకాలను అమలు చేయడం, నాయకత్వ నైపుణ్యాలు రూపొందించడం, వ్యర్థాలను వేరు చేసే ప్రయత్నాలను మెరుగుపరచడానికి పుష్ కార్ట్స్ ను మునిసిపల్ కార్పొరేషన్ కు అందించడం. నవంబర్ 2024లో ఇది ఆరంభమైన నాటి నుండి, ప్రాజెక్ట్ ఇప్పటికే గణనీయమైన పురోగతిని సాధించింది. మూడు OLCలు ఏర్పాటు చేయబడ్డాయి, సుమారు 90 మంది పిల్లలకు ప్రయోజనం కలుగుతోంది. అయిదు శిక్షణా సమావేశాలు నిర్వహించబడ్డాయి, మెరుగుపరచబడిన భద్రతా పద్ధతులు మరియు నైపుణ్యాలతో 150 మంది వ్యర్థాలను ఏరుకునే పని వారికి సాధికారత కల్పించబడింది. ట్రైసైకిల్స్ మరియు తోపుడు బంట్లను పంపిణీ చేయడం ద్వారా జీవనోపాధి మద్దతు కేటాయించబడింది, ఈ వర్గాలలో ఆర్థిక స్థిరత్వం శక్తివంతం చేయబడింది. బాధ్యతాయుతమైన వ్యర్థాల నిర్వహణను ప్రోత్సహించడానికి పాఠశాలలు మరియు కాలేజీలలో పారిశుద్ధ్య డ్రైవ్స్ సహా ఆరోగ్యం, పరిశుభ్రత, పారిశుద్ధ్యం మరియు పర్యావరణ చైతన్యం పై చైతన్య కాంపైన్స్ ప్రారంభించబడ్డాయి.
తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ వారికి 10 స్టీల్ తోపుడు బళ్లను విరాళంగా అందచేసిన ఒక ముఖ్యమైన కార్యక్రమం జరిగింది. తోపుడు బళ్లను అందచేసిన కార్యక్రమానికి శ్రీ చరణ తేజ, అదనపు కమిషనర్ మరియు శ్రీ అమరయ్య, డిప్యూటీ కమిషనర్ లు హాజరయ్యారు. నగర వ్యర్థాల నిర్వహణ యొక్క మౌళిక సదుపాయాన్ని శక్తివంతం చేయడంలో కార్యక్రమం చేపట్టిన బాధ్యతను వారు ప్రశంశించారు. విద్య, జీవనోపాధి, మరియు సామాజిక మద్దతను మెరుగుపరచడమే కాకుండా, వ్యర్థాలను ఏరుకునే వారి పర్యావరణ సుస్థిరత యొక్క గుర్తింపు లేని ఈ ప్రజల అపురూపమైన తోడ్పాటును కూడా గుర్తించిన సమగ్రమైన కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు నేను DBRC మరియు టెట్రా ప్యాక్ లను శ్లాఘిస్తున్నాను, అని శ్రీ చరణ్ తేజ, అదనపు కమిషనర్ అన్నారు.
Read Also: Nithyananda : బొలీవియాలోని 4.80 లక్షల ఎకరాల్లో నిత్యానంద కలకలం