Site icon HashtagU Telugu

SMFG : గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను నెలకొల్పిన SMFG ఇండియా క్రెడిట్

Credit to SMFG India for setting the Guinness World Record

Credit to SMFG India for setting the Guinness World Record

SMFG : భారతదేశంలోని 6 వేదికలలో 517 మంది అభ్యర్థులు పాల్గొనగా “అతిపెద్ద పశువుల సంక్షేమ పాఠం (బహుళ వేదికలు)” కోసం SMFG ఇండియా క్రెడిట్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సాధించడం ద్వారా చరిత్ర సృష్టించింది. కంపెనీ 7వ ఎడిషన్ పశు వికాస్ డే (PVD)లో భాగంగా దేశవ్యాప్తంగా నిర్వహించిన అతిపెద్ద ఒకరోజు పశువుల సంరక్షణ శిబిరాలు ద్వారా ఈ మైలురాయిని సాధించారు. ఈ శిబిరాలు 16 రాష్ట్రాలలోని 500 ప్రదేశాలలో ఏకకాలంలో నిర్వహించబడ్డాయి. దీనిద్వారా దాదాపు 1,90,000 మంది లబ్ధిదారులు (1,50,000 పశువులు మరియు 40,000 పశువుల యజమానులు) ప్రయోజనం పొందారు.

Read Also: APSRTC Jobs: ఆర్టీసీలో కారుణ్య నియామకాలు.. 800 మందికి ఉద్యోగ అవకాశాలు

భారతదేశంలో, గ్రామీణ ప్రాంత జనాభాలో దాదాపు 65-70% మంది తమ జీవనోపాధి కోసం వ్యవసాయం లేదా వ్యవసాయ సంబంధిత కార్యకలాపాలపై ఆధారపడుతున్నారు. అందువల్ల, వారి జీవనోపాధి ఉత్పత్తి కార్యకలాపాలు మరియు ఆర్థిక శ్రేయస్సులో పశువులు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ విడదీయరాని బంధాన్ని గుర్తించి, SMFG ఇండియా క్రెడిట్ 7వ ఎడిషన్ పశు వికాస్ దినోత్సవాన్ని “మేరా పశు మేరా పరివార్” అనే నేపథ్యంతో జరుపుకుంది. ఇది ఈ గ్రామీణ కుటుంబాల జీవితాల్లో పశువుల ప్రాముఖ్యతను పునరుద్ఘాటించింది. వార్షిక PVD కార్యక్రమంలో 6,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు చురుకుగా పాల్గొన్నారు. ఇది గ్రామీణ సంక్షేమం పట్ల కంపెనీ నిబద్ధతను వెల్లడించింది.

SMFG ఇండియా క్రెడిట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శంతను మిత్రా మాట్లాడుతూ..“SMFG ఇండియా క్రెడిట్‌ వద్ద, అర్థవంతమైన ప్రభావాన్ని సృష్టించే సామాజిక కార్యక్రమాలను ప్రోత్సహించడం పట్ల మేము స్థిరంగా మా నిబద్ధత వెల్లడిస్తున్నాము. భారతదేశ వ్యాప్తంగా 1000+ శాఖల నిర్వహణతో, మా ప్రాథమిక దృష్టి టైర్-2+ ప్రాంతాలపై నిలిచింది, మా శాఖలలో దాదాపు 90% ఈ ప్రాంతాలలో వ్యూహాత్మకంగా ఏర్పాటు చేయబడ్డాయి. వాస్తవానికి, గత రెండు సంవత్సరాలలో, మేము దాదాపు 300 శాఖలను జోడించాము, అన్నీ టైర్-2+ భౌగోళిక ప్రాంతాలలో ఉన్నాయి. సరైన ఉత్పత్తులు మరియు ఆర్థిక పరిష్కారాలను అందించడం ద్వారా ఆర్థిక చేరికను ప్రోత్సహించడం మా లక్ష్యం, అది కమ్యూనిటీలకు వారి జీవిత చక్రంలోని ప్రతి దశలో వారికి సేవ చేయడానికి మాకు వీలు కల్పిస్తుందన్నారు.

 Read Also:   Price Hike : మద్యం ప్రియులకు మరో బిగ్ షాక్