Site icon HashtagU Telugu

IKEA : బ్యాగ్‌కు రూ.20 వ‌సూలు చేసిన ఐకియా.. షాక్ ఇచ్చిన వినియోగ‌దారుల కోర్టు

IKEA

IKEA

ఐకియాకు వినియోగ‌దారుల కోర్టు షాక్ ఇచ్చింది. క‌స్ట‌మ‌ర్ ద‌గ్గ‌ర బ్యాగ్ కోసం రూ.20 వ‌సూళు చేసినందుకు కోర్టు ఫైన్ విధించింది . ఫర్నీచర్ రిటైలర్ ఐకియా బెంగళూరులోని ఒక కస్టమర్‌కు రీఫండ్ ఇవ్వాలని వినియోగదారు కోర్టు ఆదేశించింది. ఆమె కొనుగోలు చేసిన వస్తువులను తీసుకెళ్లడానికి పేపర్ బ్యాగ్‌కు ఛార్జీ విధించినందుకు పరిహారంగా రూ. 3,000 చెల్లించాలని ఆదేశించింది. IKEA ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వినియోగదారునికి వడ్డీతో కలిపి రూ. 20, అలాగే నష్టపరిహారం కింద రూ. 1,000 మరియు వ్యాజ్యం ఖర్చుల కోసం రూ. 2,000 చెల్లించాలని ఆదేశించింది. IKEA రూ. 20 వసూలు చేసిన క్యారీ బ్యాగ్‌పై దాని లోగోను ముద్రించారు. వినియోగదారు సంగీత బోహ్రా అక్టోబర్ 6, 2022న IKEA నాగసాంద్ర బ్రాంచ్‌ని సందర్శించి, కొన్ని వస్తువులను కొనుగోలు చేశారు. ఆమె వస్తువులను తీసుకెళ్లడానికి ఒక బ్యాగ్‌ను ఇవ్వ‌మ‌ని అడ‌గ‌గా.. దానిపై స్టోర్ లోగో ఉన్నప్పటికీ దానికి రూ.20 వసూలు చేశారు.దీనిపై ఆమె వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించింది. దీనిపై విచార‌ణ చేప‌ట్టిన కోర్టు.. ఐకియాకి రూ.3వేలు జ‌రిమానా విధించింది. మూడు వేల రూపాయ‌ల‌ను క‌స్ట‌మ‌ర్‌కి ఇవ్వాల‌ని ఆదేశించింది. ఆర్డర్ అందిన తేదీ నుండి 30 రోజుల్లోగా ఆర్డర్‌ను పాటించాలని IKEAని ఆదేశించింది.

Also Read:  Murder : హైద‌రాబాద్ ఎస్ఆర్ న‌గ‌ర్‌లో యువ‌కుడు దారుణ హ‌త్య‌