Site icon HashtagU Telugu

Work with Beer: బీర్ తాగుతూ హాయిగా పనిచేసుకోవచ్చు.. ఉద్యోగులకు బంపర్ ఆఫర్!

Beer

Beer

‘‘అబ్బా.. ఏం వర్క్ రా బాబు.. ఎన్ని గంటలు చేసినా కంప్లీట్ కావడం లేదు’’ ఇలాంటి డైలాగ్స్ ప్రతి ఆఫీసు (Office)లో వినిపిస్తూనే ఉంటాయి. ఇక స్టాఫ్ట్ వేర్ కంపెనీస్ లో అయితే సర్వసాధారణమే. అలాంటివాళ్లకు ఓ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగం చేసే చోటా మందు తాగుతూ వర్క్ చేసుకోవచ్చు. బోర్ కొడితే అలా ఆఫీస్ క్యాంటిన్ కు వెళ్లి బీరు (Beer) తాగొచ్చు. మీరు విన్నది నిజమే.

హర్యానా ప్రభుత్వం 2023-24 సంవత్సరానికి కొత్త మద్యం పాలసీని ప్రవేశపెట్టింది. పెద్ద కార్పొరేట్ కార్యాలయాల ఉద్యోగులు తక్కువ కంటెంట్ ఉన్న ఆల్కహాల్ ఆఫీస్ పరిసరాల్లో తాగొచ్చు. ఆ తర్వాత పని కూడా చేసుకోవచ్చు. హర్యానా (Haryana) మంత్రుల మండలి ఆమోదించిన ఈ విధానం అందర్నీ ఆకర్షిస్తోంది. కాకపోతే ఇందుకు కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి. కనీసం 5,000 మంది ఉద్యోగులు,  కనీసం లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న కార్పొరేట్ కార్యాలయాల్లో మాత్రమే మందు, బీర్ తాగొచ్చు.

పాలసీ ప్రకారం కార్పొరేట్ కార్యాలయాలకు ప్రత్యేక లైసెన్స్ (L-10F) మంజూరు చేయబడుతుంది. కార్యాలయం ₹3 లక్షల సెక్యూరిటీ మొత్తానికి అదనంగా ₹10 లక్షల వార్షిక స్థిర రుసుము చెల్లించిన తర్వాత లైసెన్స్ జారీ చేయబడుతుంది. లైసెన్స్ పొందిన కార్యాలయాలు రద్దీగా ఉండకూడదు. బయటి వ్యక్తులు లోపలికి రావొద్దు. మద్యం స్టాక్‌ను కొనుగోలు చేయడం పాలసీ నిబంధనలకు లోబడి ఉండాలి. కలెక్టర్ (ఎక్సైజ్), ఎక్సైజ్ మరియు టాక్సేషన్ కమిషనర్ ఆమోదంతో, L-10F లైసెన్స్‌ను మంజూరు చేస్తారు. ఇది డిప్యూటీ ఎక్సైజ్ మరియు టాక్సేషన్ కమిషనర్ ద్వారా పునరుద్ధరించబడుతుంది.

Also Read: Gali Janardhan Reddy: కర్ణాటక ఎన్నికల్లో గాలి జనార్ధన్ రెడ్డి విజయం

Exit mobile version