Eatala Rajender : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనివార్యమైన పరిస్థితుల్లోనే జరిగిందని, దాని పూర్వాహ్నంలో జరిగిన విద్యార్థుల త్యాగాలను గుర్తుచేసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఆ ఉద్యమాన్ని అణచివేయడమే చేసింది అని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో అన్ని రాజకీయ పార్టీలు ఏకమై పోరాడాయి. అయితే, ప్రత్యేక రాష్ట్ర స్థాపనలో బీజేపీ కీలక పాత్ర పోషించింది. కానీ, కాంగ్రెస్ మాత్రం రాజకీయ ఒత్తిళ్ల మధ్య, పరిస్థితులని తట్టుకోలేక ఈ రాష్ట్రాన్ని ఇచ్చింది. ఇది వారి చిత్తశుద్ధిని కాదు అన్నారు.
Read Also: 1 Cr Check : బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కి కోటి రూపాయిలు ఇచ్చిన సీఎం రేవంత్
ఈటల అమరుల త్యాగాలను స్మరిస్తూ మూడు తరాల ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన విద్యార్థులకు నేడు నివాళులు అర్పిస్తున్నాం. కానీ వారి ఆశయాలను సాకారం చేయడంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండు పార్టీలూ విఫలమయ్యాయి అన్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి పాలనపై విమర్శలు చేస్తూ, ఈటల అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరైనా, అమరుల కుటుంబాలకు హామీలు నెరవేర్చలేదు. వాస్తవానికి, తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసిన పార్టీగా కాంగ్రెస్ నిలిచింది. కేసీఆర్ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో అవినీతికి అడ్డూఅదుపుల్లేకుండా సాగింది. కానీ ఆ పాలనపై చర్యలు తీసుకోవడంలో ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.
తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ జీడీపీ, ఆదాయం తక్కువే అయినా అభివృద్ధిలో ముందుంది. తెలంగాణ మాత్రం అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతోంది. ప్రస్తుత ప్రభుత్వం దీన్ని ఎదుర్కొనటంలో పూర్తిగా అసమర్థంగా ఉంది. సీఎం రేవంత్‌పై విమర్శలు చేస్తూ ఢిల్లీలోకి వెళ్లగానే ప్రధానికి పెద్దన్న అని, హైదరాబాద్‌కి వచ్చాక విమర్శలు చేయడం ప్రజలను మభ్యపెట్టే రాజకీయంగా మారింది అని అన్నారు. బీజేపీ భవిష్యత్‌పై నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ, ఈటల చెప్పారు. ఇక్కడ బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం. అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించడం కూడా తథ్యం. ఇతర అంశాలపైనా మాట్లాడిన ఈటల బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావుతో నేను కలుస్తానంటున్నారు. అసలు ఎందుకు కలుస్తాను? ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన అవినీతిపై ఇప్పటివరకు చర్యలు తీసుకున్నారా?” అని ప్రశ్నించారు. ఈటల వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరిన్ని దుమారాలను రేపే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Also: Shopping Places : హైదరాబాద్‌లో అతి తక్కువ ధరల్లో షాపింగ్ చేయడానికి బెస్ట్ ప్లేస్‌లు ఇవే !!