Target Telangana : ఇక కాంగ్రెస్ టార్గెట్ తెలంగాణ.. 24న కీలక భేటీ

కర్ణాటకలో ఘన విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కాంగ్రెస్ కొత్త టార్గెట్ ను(Target Telangana) పెట్టుకుంది.

  • Written By:
  • Publish Date - May 21, 2023 / 02:53 PM IST

కర్ణాటకలో ఘన విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కాంగ్రెస్ కొత్త టార్గెట్ ను(Target Telangana) పెట్టుకుంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్, రాజస్తాన్ రాష్ట్రాలపై ఫోకస్ పెట్టింది. ఈక్రమంలోనే ఆ నాలుగు రాష్ట్రాల నేతలతో మే 24న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే భేటీ కానున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ (Target Telangana) కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్‌తో పోటీ పడుతోంది. మరోవైపు తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల్లో సాధించిన ఫలితాలు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్  ఎన్నికల రిజల్ట్స్ ఇచ్చిన జోష్ తో బీజేపీ ముందుకు సాగుతోంది.

also read : Telangana Politics: కాంగ్రెస్ వీడిన వాళ్లంతా వెనక్కి తిరిగి రావాలి: రేవంత్

ఈనేపథ్యంలో బీఆర్ఎస్, బీజేపీ లను ఢీకొట్టేందుకు తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి నేతృత్వంలో హస్తం పార్టీ సమాయత్తం అవుతోంది. పార్టీ నేతలను ఏకతాటిపైకి తేవడంలో రేవంత్ సక్సెస్ అయ్యారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా రేవంత్ నిత్యం శ్రమిస్తున్నారు. ఇటువంటి తరుణంలో మే 24న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తో జరిగే భేటీలో రాష్ట్రంలోని రాజకీయ  పరిస్థితులను రేవంత్ వివరించనున్నారు. ఎటువంటి జనాకర్షక  వ్యూహంతో అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగాలనే దానిపై నాలుగు రాష్ట్రాల నేతలకు కాంగ్రెస్ అధిష్టానం దిశా నిర్దేశం చేయనుంది.

రాజస్తాన్‌..

రాజస్తాన్‌లో అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్‌ల మధ్య వైరం నడుస్తోంది. అక్కడ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయి.  వీటిని పరిష్కరించే దిశగా ఉన్న మార్గాలపై మే 24న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో ఆ రాష్ట్ర నేతల మీటింగ్ లో చర్చ జరగనుంది.