CM Revanth Reddy : రేపు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి..?

AICC నాయకులతో ముఖ్యమైన సమావేశంలో పాల్గొనడానికి సీఎం కు ఈ పిలుపు వచ్చినట్టు తెలుస్తోంది.

Published By: HashtagU Telugu Desk
Transgenders for traffic control: CM orders to officials

Transgenders for traffic control: CM orders to officials

CM Revanth Reddy: తెలంగాణ ముఖ మంత్రి రేవంత్‌ రెడ్డి రేపు దేశ రాజధాని ఢిల్లీ(Delhi)కి వెళ్లనున్నుట్లు సమాచారం. AICC నాయకులతో ముఖ్యమైన సమావేశంలో పాల్గొనడానికి సీఎం కు ఈ పిలుపు వచ్చినట్టు తెలుస్తోంది.

We’re now on WhatsApp. Click to Join.

పార్లమెంట్ ఎన్నికల విజయం జోరులో ఉన్న కాంగ్రెస్.. ఆ పార్టీలో భారీ మార్పులు చేయనున్నట్టు చర్చ జరుగుతోంది. లోక్ సభ విపక్ష నేత రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీలో భారీ మార్పులు చేపట్టనున్నారని సమాచారం. ఏఐసీసీ ప్రదాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో పాటు పలు రాష్ట్రాల కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జీ లను మార్చాలనేది రాహుల్ గాంధీ ఉద్దేశం అని ఢిల్లీ కాంగ్రెస్ నాయకులు అనుకుంటున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జీగా ఉన్న దీపా దాస్ మున్షీని పశ్చిమబెంగాల్ కి పంపించి.. తెలంగాణకు భూపేష్ భగీల్ ను నియమించనున్నట్టు సమాచారం. ఇందుకోసమే రేపు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది.

కాగా, ఇటివల ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అమెరికా, సౌత్ కొరియా వంటి దేశాల్లో పర్యటించిన విషయం తెలిసిందే. మన దేశంలో వివిధ దేశాలకు చెందిన వారు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం.

Read Also: Clove Benefits : చాక్లెట్, చూయింగ్ గమ్‌కు బదులుగా రోజూ రెండు లవంగాలను నమలండి..!

  Last Updated: 21 Aug 2024, 06:24 PM IST