Site icon HashtagU Telugu

Musi : సీఎం రేవంత్‌ రెడ్డి మూసీ పై బహిరంగ చర్చకు సిద్ధమా?: హరీశ్‌ రావు

BRS Leader Harish Rao

BRS Leader Harish Rao

Harish Rao :  మాజీ మంత్రి హరీశ్‌రావు మరోసారి మూసీ ప్రాజెక్టుపై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మూసీపై వాస్తవాలు దాచిపెడుతున్నదని, పార్లమెంటును రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టించడం సిగ్గుచేటని విమర్శించారు. దీనిపై చర్చించడం కోసం ఎక్కడికైనా వచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. భూసేకరణ చట్టం ప్రకారం.. బాధితులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రేవంత్ ప్రజలను కేంద్రాన్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు. మూసీ బాధితుల సమస్యలపై బహిరంగ చర్చకు సీఎం రేవంత్ రెడ్డి సిద్దమా..? హరీశ్ రావు సవాల్ విసిరారు.

మూసీ బాధితుల పక్షాన కోర్టుకు వెళ్తామని.. రేవంత్ రెడ్డి పై పార్లమెంట్ లో ప్రివిలేజ్ మోషన్ ఇస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాని సూటిగా అడుగుతున్నా మూసీ పై బహిరంగ చర్చకు సిద్ధమని హరీశ్‌రావు తెలిపారు. బుల్డోజర్ ఎక్కిస్తా రా..? సంపేస్తా.. తొక్కుతా.. లీడర్లతో తిట్టించడం అనేది సొల్యూషన్ కాదు అని హరీశ్ రావు పేర్కొన్నారు.  ముఖ్యమంత్రి ఎక్కడికి రమ్మంటారో చెప్పండి.. వస్తాను. మేము దేని గురించైనా ప్రశ్నిస్తే.. మాపై బురద జల్లుతున్నారు. సచివాలయం రమ్మన్నా నేను వస్తానని హరీశ్ రావు సవాల్ చేశారు. అఖిల పక్ష సమావేశం పెడుతానన్నావు. మేము రావడానికి సిద్దం అని చెప్పాం. ఎప్పుడైనా మేము సిద్దమని చెప్పినట్టు హరీశ్ రావు తెలిపారు.

కాగా, దేశంలో ఏ ప్రాజెక్టులోనైనా నిర్వాసితులను ఆదుకోవాలని 2013 చట్టం వచ్చిందన్నారు. మెరుగైన చట్టం అమలు చేస్తే ఆయా రాష్ట్రాలు సొంతంగా చట్టాలు తెచ్చుకునే వెసులుబాటు ఇచ్చారు. అందుకే బీఆర్‌ఎస్‌ హయాంలో మరింత మెరుగ్గా 2014 భూసేకరణ చ్టటాన్ని తీసుకొచ్చినట్లు చెప్పారు. 2014 భూసేకరణ చట్టం ఈ రోజుకూ రాష్ట్రంలో అమల్లో ఉందన్నారు. నిర్వాసితుల అభ్యంతరాలను భూసేకరణ అధికారి పరిగణనలోకి తీసుకోవాలి. అభ్యంతర పరిగణనలోకి తీసుకుని మరో 30 రోజుల గడువు ఇస్తూ పీడీ నోటిఫికేషన్‌ ఇవ్వాలి. నిర్వాసితుల అభ్యంతరాలను నివృత్తి చేసిన అనంతరమే ప్రక్రియ మొదలుపెట్టాలని హరీశ్ రావు అన్నారు.

Read Also: Graduate MLC Elections : ‘గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ’ బరిలో జీవన్ రెడ్డి.. టీ కాంగ్రెస్ తీర్మానం