Site icon HashtagU Telugu

Press Meet : రాష్ట్రంలో ప్రతీ నిరుద్యోగికీ ఉద్యోగం..అందరికీ ఉపాధి..మా ప్రభుత్వ ఆలోచన: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy press meet

CM Revanth Reddy press meet

CM Revanth Reddy press meet : ప్రతిపక్ష బీఆర్ఎస్‌ పార్టీ తెలంగాణ ప్రభుత్వంపై వరుస ఆరోపణలు చేస్తుండటంతో.. తాజా పరిణామాలపై సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి.. కీలక అంశాలపై మాట్లాడారు. “గత పది నెలలుగా 33 మంది అధికారులు చేసిన కార్యాచరణను ప్రభుత్వం తీసుకుంటోంది. అధికారులు.. మూసీ పరీవాహక ప్రాంతంలో ప్రజల్ని కలిసి.. అక్కడ వాళ్లు ఎదుర్కొంటున్న కష్టాలు, సమస్యలు తెలుసకొని, పేద ప్రజల్ని కలిసి, వారి సమాచారాన్ని సేకరించి, వారిని ఎలా ఆదుకోవాలి అనేది తెలుసుకున్నారు. అందుకు అయ్యే ఖర్చు విషయంలో వెనకాడకూడదు అనేది మా ప్రభుత్వం ప్లాన్. రాష్ట్రంలో ప్రతీ నిరుద్యోగికీ ఉద్యోగం కల్పించాలి. అందరికీ ఉపాధి కల్పించాలి. తద్వారా వారి జీవితాల్లో మార్పు రావాలన్నది మా ప్రభుత్వ ఆలోచన” అని రేవంత్ రెడ్డి అన్నారు.

“కరువు వస్తే, బురద తిని బతికిన రోజులు ఉన్నాయి ఈ దేశంలో. ఇప్పుడు మిగులు ఆహార దేశంగా మారిందంటే కారణం కాంగ్రెస్ పార్టీ. సిలికాన్ వ్యాలీకి కారణం రాజీవ్ గాంధీ కాదా? నిరుద్యోగ యువతకు కంప్యూటరైజేషన్, సాంకేతిక విప్లవాన్ని తెచ్చింది మాజీ ప్రధాని, దివంగత రాజీవ్ గాంధీయే. రాజీవ్ గాంధీ ఈ దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకెళ్లారు. మాజీ ప్రధాని నెహ్రూ నుంచి రాజీవ్ వరకూ గొప్ప విధానాలు తెచ్చారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పెట్టుబడిలో సరళీకృత విధానాలు తెచ్చారు. మన బడ్జెట్ లక్షల కోట్లకు తీసుకురావడం వెనక ఆయన కృషి ఉంది. పేదలకు భూములకు హక్కులు ఎలా వచ్చాయి? ప్రభుత్వాలు ఇవ్వడం ద్వారా వచ్చాయి. వీపీ వ్యవసాయ సంస్కరణలు తెచ్చారు. కొంతమంది ఎప్పుడూ పేదలు పేదలుగానే ఉండాలని కోరుకుంటారు. వాళ్లు పోతేనే ఆ భావజాలం పోతుంది. అధికారం కోల్పోయామనే నిస్పృహతో బందిపోటు దొంగల కంటే దారుణంగా మారారు. ప్రజా ప్రతినిధుల ముసుగులో… స్వేచ్ఛగా తిరుగుతున్నారు. వారు మూసీ నది పునరుజ్జీవనాన్ని అడ్డుకుంటున్నారు” అని సీఎం రేవంత్ అన్నారు.

మరోవైపు ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సెక్రటేరియట్ లోని ఆరో అంతస్థులో ఈ సమావేశం జరగనుంది. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు, రెవెన్యూ చట్టం, మూసీ బాధితులకు పరిహారం, హైడ్రా ఆర్డినెన్స్ వంటి అంశాలపై కేబినెట్ మీట్‌లో చర్చ జరగనుంది.

Read Also: KTR : సీఎం రేవంత్ రెడ్డి ఉడుత ఊపుల‌కు భ‌య‌ప‌డం..