CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. చెడు పై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి పండుగను రాష్ట్రం లోని ప్రజలందరూ సుఖ, సంతోషాలతో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని తెలిపారు. ఈ దీపాల కాంతులతో ప్రతీ ఇంటింటా సుఖ, సంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. పర్యావరణానికి హాని కలిగించకుండా చిన్నా, పెద్దలందరూ పండుగ జరుపుకోవాలని.. ప్రమాదాలకు తావు లేకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గత పదేళ్ల విధ్వంసపు పాలనలో చీకట్లు తొలగిపోయాయని.. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా ప్రజా పాలనలో తెలంగాణ వెలుగులు విరజిమ్ముతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
మరోవైపు ఏపీ ముఖ్యమంతి చంద్రబాబు కూడా తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. నరకాసుర వధ తర్వాత ఇంటింటా దీపాలు వెలిగించుకుని సంతోషంగా జరుపుకునే వెలుగుల పండుగ ఇది అంటూ ప్రస్తావించారు. ఒక దీపాన్ని వెలిగించడం ద్వారా మన చుట్టూ ఉన్న చీకట్లను పారదోలినట్టుగా ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీల్లో భాగంగా ‘దీపం 2.0’ పథకం అమలుతో ఈ దీపావళిని మరింత కాంతివంతం చేస్తున్నామని చంద్రబాబు అన్నారు.