flooding in Bengal: పశ్చిమ బెంగాల్‌లో వరదలకు దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ కారణమని సీఎం మమతా బెనర్జీ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. జార్ఖండ్ సరిహద్దును మూసివేయాలని నిర్ణయించారు. ఈ మేరకు మూడు రోజుల పాటు సరిహద్దులను మూసివేయాలంటూ అధికారులను మమతా ఆదేశించారు. జార్ఖండ్‌కు నీరు వదిలే క్రమంలో పశ్చిమ బెంగాల్‌లోని పలు జల్లాలను వరద నీరు ముంచెత్తడంతో దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (డీవీసీ) వ్యవహారించిన తీరుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు.
ఇది కేవలం మానవ తప్పిదం..
జార్ఖండ్‌ను రక్షించడం కోసం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ ఈ విధంగా వ్యవహరించడం వల్లే వరద నీరు రాష్ట్రానికి పోటెత్తిందన్నారు. అవసరమైతే దామోదర్ వ్యాలీ కార్పొరేషన్‌తో తెగ తెంపులు చేసుకునేందుకు తాము సిద్దంగా సీఎం మమత స్పష్టం చేశారు. జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల సరిహద్దులను మూడు రోజుల పాటు మూసి వేయాలని అధికారులను సీఎం మమత ఆదేశించారు. ఇది కేవలం మనవ తప్పిదమని ఆమె పేర్కొన్నారు. డీవీసీ.. డ్యామ్‌ల వద్ద పూడిక తీయడంలో దారుణంగా విఫలమయిందని విమర్శించారు. పశ్చిమ బెంగాల్‌లో వరద నీరు చుట్టు ముట్టిన హౌరా, మిడ్నాపూర్ జిల్లాల్లోని పలు వరద నీటి ప్రభావిత ప్రాంతాల్లో సీఎం మమత పర్యటించారు.
ఈ తరహా ఘటనలు గతంలో చోటు చేసుకోలేదు..
అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఇదేమీ వర్షపు నీరు కాదన్నారు. డీవీసీ వదిలిన నీరు అని ఆమె వ్యంగ్యంగా అన్నారు. డీవీసీ వ్యవహార శైలి ఇదే విధంగా కొనసాగితే.. వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాన్ని చేపడతామని సీఎం మమతా బెనర్జీ హెచ్చరించారు. డీవీసీ డ్యామ్‌ల్లో నీటి స్టోరేజ్ కేపాసిటిపై ఈ సందర్భంగా ఆ సంస్థకు పలు ప్రశ్నలను సీఎం మమత సంధించారు. ఈ తరహా ఘటనలు గతంలో చోటు చేసుకోలేదని సీఎం మమత గుర్తు చేశారు. డీవీసీ డ్యామ్‌ల నుంచి భారీగా నీరు వదల వద్దంటూ ఆ సంస్థ చైర్మన్‌కు తాను సూచనలు సైతం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించారు. ఈ ఏడాది 5.5 లక్షల క్యూసెక్ల నీటిని డీవీసీ విడుదల చేసిందన్నారు. అందుకే బెంగాల్‌లో వరద పరిస్థితి ఏర్పడిందని సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు.
Read Also: Mahesh Kumar : గాంధీ భవన్ లో రేపటి నుండి జిల్లాల సమీక్ష సమావేశాలు