Site icon HashtagU Telugu

PM Modi : మరోసారి ప్రధాని మోడీకి దీదీ లేఖ

CM Mamata Banerjee letter to Prime Minister Modi once again

CM Mamata Banerjee letter to Prime Minister Modi once again

PM Modi:  ప్రధాని మోడీకి మరోసారి పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ లేఖ రాశారు. ఈ సందర్భంగా మమత.. కఠినమైన కేంద్ర చట్టం, అత్యాచారం, హత్య వంటి క్రూరమైన నేరాలను పాల్పడి నిందితులను శిక్షించాలని.. నిర్ణీత గడువులోపు కేసులను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఆగస్టు 22న మోడీకి లేఖ రాసినట్లు ప్రస్తుత లేఖలో పేర్కొన్నారు. తమ నుంచి ఎలాంటి స్పందన రాలేదని స్పష్టం చేశారు. అటువంటి సున్నితమైన సమస్యపై పీఎం వైపు నుంచి ఎటువంటి స్పందన రాలేదని లేఖలో పేర్కొన్నారు. ప్రధాని సమాధానానికి బదులుగా కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నుంచి సాధారణ సమాధానం వచ్చిందని లేఖలో తెలిపారు. ఈ సాధారణ ప్రత్యుత్తరాన్ని పంపేటప్పుడు సమస్య యొక్క తీవ్రతను దృష్టిలో ఉంచుకోలేదనిబ భావించారు. ఈ అంశంపై తర్వగా చర్యలు తీసుకోవాలని కోరారు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా.. గురువారం తృణమూల్‌ కాంగ్రెస్‌ విద్యార్థి విభాగం ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సీఎం మమతా బెనర్జీ జూనియర్ డాక్టర్లను హెచ్చరించారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తే మీ జీవితాలు నాశనమవుతాయి అంటూ హెచ్చరికలు జారీ చేశారు. నిరసనలు ఆగేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్రానిదేనని సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తుచేశారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తే మీ భవిష్యత్తు నాశనమవుతుందని.. మీరు ఎప్పటికీ విసా, పాస్‌పోర్టులు పొందలేరని మమతా వార్నింగ్ ఇచ్చారు. దీనిపై స్పందించిన బాధితురాలి తల్లి ఈ మేరకు వ్యాఖ్యానించారు.

ఈ ఘటనపై బాధితురాలి తల్లి స్పందించారు. నిరసనలకు వ్యతిరేకంగా బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యలను ఆమె తప్పుబట్టారు. మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు తనకు నచ్చలేదన్నారు. తన కుమార్తెపై జరిగిన అఘాయిత్యానికి వ్యతిరేకంగా డాక్టర్లు, విద్యార్థులు, తదితరులు న్యాయం కోసం పోరాడుతున్నారని చెప్పారు. నిందితులకు శిక్ష పడేవరకు విద్యార్థులు ఊరుకోరన్నారు. ఈ అంశంపై ప్రపంచం మొత్తం తన కుమార్తెకు అండగా నిలుస్తుందన్నారు. కన్నబిడ్డను కోల్పోయిన బాధలో ఉన్న మమ్మల్ని మమత వ్యాఖ్యలు మరింతగా బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెకు పిల్లలు ఉంటే ఆ బాధ ఏంటో తెలిసేదన్నారు.

Read Also: Hyderabad: వేములవాడ ఆలయ అర్చకుల ఆశీస్సులు అందుకున్న సీఎం రేవంత్‌రెడ్డి