Bangladesh : షేక్‌ హసీనా పై సీఐడీ కేసు నమోదు

. కోర్టు ఆదేశాల మేరకు దీనిపై క్రిమినల్ ఇన్వెస్టిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ (సీఐడీ) విచారణ ప్రారంభించింది. అని పోలీసు ఉన్నతాధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు.

Published By: HashtagU Telugu Desk
Sheikh Hasina escape plan

Sheikh Hasina escape plan

Bangladesh : బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. హసీనాతోపాటు మరో 72 మందిపై కేసులు నమోదైనట్లు అక్కడి ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మహ్మద్‌ యూనస్‌ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కుట్ర పన్నుతున్నారనే అభియోగంపై షేక్‌ హసీనాపై ఢాకా మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో కేసు నమోదైంది. కోర్టు ఆదేశాల మేరకు దీనిపై క్రిమినల్ ఇన్వెస్టిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ (సీఐడీ) విచారణ ప్రారంభించింది. అని పోలీసు ఉన్నతాధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు.

Read Also: Sravan Rao at SIT : ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారం.. ‘సిట్‌’ ఎదుటకు శ్రవణ్‌ రావు.. వాట్స్ నెక్ట్స్ ?

బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చోటుచేసుకున్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో గతేడాది ఆగస్టు 5న దేశం వీడిన షేక్‌ హసీనా భారత్‌లో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో హసీనాతోపాటు ఆమె మంత్రివర్గంలో ఉన్న నేతలు, సలహాదారులు, సైనికాధికారులపైనా నేరారోపణలు నమోదయ్యాయి. ఈక్రమంలో ఢాకా కేంద్రంగా ఉన్న ఇంటర్నేషనల్‌ క్రైమ్స్‌ ట్రైబ్యునల్‌ ఇప్పటికే ఆమెకు అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. కాగా, షేక్‌హసీనా గతేడాది డిసెంబర్‌ 19న ఆన్‌లైన్‌లో సమావేశాన్ని ఏర్పాటుచేసినట్లు సీఐడీకి స్పష్టమైన సమాచారం ఉంది. జాయ్‌ బంగ్లా బ్రిగేడ్‌ పేరుతో వ్యవస్థను ఏర్పాటుచేసి.. తద్వారా బంగ్లాలో మళ్లీ హసీనా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలన్నది ఆ సమావేశం ముఖ్య ఉద్దేశం. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు హసీనా కుట్ర పన్నుతున్నారంటూ సీఐడీ ఆమెపై కేసు నమోదు చేసింది.

Read Also: Earthquake: భారత్‌ మరోసారి సాయం.. మయన్మార్‌కు 80 మంది ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది!

 

  Last Updated: 29 Mar 2025, 03:19 PM IST