Site icon HashtagU Telugu

Jani Master : జైలు నుండి కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ విడుదల

Choreographer Jani Master released from prison

Choreographer Jani Master released from prison

Chanchalguda Jail : కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ శుక్రవారం చంచల్ గూడ జైలు నుండి విడుదలయ్యారు. షరతులతో తెలంగాణ హైకోర్టు అక్టోబర్ 24న ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. కోర్టు ఆదేశాలను జైలు అధికారులకు అందించడంతో ఆయనను విడుదల చేశారు. మహిళా కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే కేసులో ఆయనను నార్సింగి పోలీసులు ఈ ఏడాది సెప్టెంబర్ 19న గోవాలో అరెస్ట్ చేశారు. 36 రోజుల తర్వాత జైలు నుంచి ఆయన విడుదలయ్యారు.

కాగా, లైంగిక వేధింపులు, పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న జానీ మాస్టర్‌ను రాజేంద్రనగర్‌ ఎస్‌వోటీ పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గోవా స్థానిక కోర్టులో ప్రవేశపెట్టి పీటీ వారెంట్‌ తీసుకుని.. హైదరాబాద్‌ తీసుకువచ్చారు. జానీ మాస్టర్‌పై రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో లైంగిక వేధింపులకు సంబంధించి జీరో ఎఫ్‌ఐఆర్‌ కాగా..అదే రోజున నార్సింగ్‌ పోలీసులు మరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అనంతరం బాధితురాలి వాంగ్మూలాన్ని సేకరించారు.

2017లో ఓ కాంటెస్ట్‌లో పాల్గొనే అవకాశం వచ్చిన బాధితురాలు.. హైదరాబాద్‌కు వచ్చారు. 2019 నుంచి జానీ మాస్టర్‌ వద్ద అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ముంబైలో షూటింగ్‌ సమయంలో అక్కడ హోటల్‌ గదిలో తనపై జానీ మాస్టర్‌ లైంగిక దాడికి పాల్పడ్డట్లు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఎక్కడైనా చెబితే ఉద్యోగంలోంచి తీసేస్తానని, సినిమాల్లో ఎక్కడా పని దొరకకుండా చేస్తానని బెదిరించినట్లు తెలిపారు. దాంతో తాను మిన్నకుండిపోవడాన్ని అవకాశంగా తీసుకుని, తరచూ షూటింగ్‌ ప్రదేశాల్లో వేధించేవాడని.. వ్యానిటీ వ్యాన్‌లో తన కోరిక తీర్చాలంటూ బలవంతపెట్టేవాడని వివరించారు. ఒప్పుకోకుంటే తన జుట్టు పట్టుకుని దాడి చేసేవాడని.. ఓ సందర్భంలో అద్దంతో నా ముఖంపై కొట్టాడని వాపోయారు. మాట వినకపోతే.. షూటింగ్‌ లొకేషన్‌లో అందరి ముందు అవమానపరిచేవాడని, అసభ్యంగా తాకేవాడని తెలిపారు. మతం మారి, తనను పెళ్లి చేసుకోవాలని హింసించేవాడని చెప్పారు.

జానీ మాస్టర్‌ వేధింపులు పెరగడంతో.. తాను సొంతంగా పనిచేయడం ప్రారంభించినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపారు. దీంతో జానీ మాస్టర్‌ ఓ రోజు తన భార్యతో కలిసి ఇంటికి వచ్చినట్లు చెప్పారు. వారిద్దరూ ఇంట్లోకి బలవంతంగా చొరబడ్డారని, జానీ మాస్టర్‌ భార్య తనపై చేయి చేసుకున్నారని వివరించారు. ఓ సారి రాత్రి ఇంటికి వచ్చి, తలుపు తట్టాడని, తాను స్పందించకపోవడంతో.. బయట పార్క్‌ చేసి ఉన్న తన స్కూటీని ధ్వంసం చేశాడని తెలిపారు. తాను షూటింగ్‌లో ఉన్న ప్రాంతానికి వచ్చి, గొడవపడేవాడని, పెళ్లి చేసుకుంటానని, మతం మారాలని అందరి ముందు వేధించేవాడని వెల్లడించారు. ”ఈ క్రమంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు నాపై దాడికి యత్నించారు. గుర్తుతెలియని పార్సిల్‌ పంపి భయభ్రాంతులకు గురిచేశారు. ఇండస్ట్రీలో నేను ఒప్పుకొన్న పనులను కూడా చేయకుండా జానీ మాస్టర్‌ వేధింపులకు గురిచేస్తున్నారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోగలరు” అని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Read Also: YS Sharmila కీలుబొమ్మగా మారారు: లేఖ పై ఘాటుగా స్పదించిన వైస్‌ఆర్‌సీపీ