China Vs G20 Kashmir : కాశ్మీర్లో G20పై విషం కక్కిన చైనా Pasha Published Time : 20 May 2023, 10:03 AM China Vs G20 Kashmir చైనా వంకర బుద్ధి మారడం లేదు.. ఇండియాపై ఉన్న అక్కసును డ్రాగన్ దేశం ఏ మాత్రం తగ్గించుకోవడం లేదు. పాకిస్తాన్ కు వత్తాసు పలుకుతూ బరితెగింపు కామెంట్స్ ను చేస్తోంది. ఈ ఏడాది G20 దేశాల కూటమికి ఇండియా ప్రెసిడెంట్ గా(China Vs G20 Kashmir) వ్యవహరిస్తుండటం చైనాకు మింగుడు పడటం లేదు. సెప్టెంబర్ 9, 10 తేదీల్లో ఇండియా రాజధాని ఢిల్లీ వేదికగా జరగనున్న G20 దేశాల కూటమి సదస్సును(China Vs G20 Kashmir) తలచుకొని బాధపడుతోంది. ఈక్రమంలోనే మే 22 నుంచి 24 వరకు కాశ్మీర్ లోని శ్రీనగర్ వేదికగా జరగనున్న G20 సదస్సుపై చైనా పిచ్చి కూతలు కూసింది. కాశ్మీర్లో G20 సమావేశాన్ని నిర్వహించడం ఏమిటంటూ ఇండియాను నిలదీసింది. భారత్ తన సొంత భూభాగంలో G20 సమావేశాలు నిర్వహించుకోవడం మంచిదని వెర్రి సలహా ఇచ్చింది. కాశ్మీర్లో జరిగే G20 మీటింగ్ కు తాము హాజరు కాబోమని వెల్లడించింది. also read : China Dna Attack : టిబెటన్లపై డీఎన్ఏ అటాక్.. చైనా ఏం చేస్తోందంటే ? ” మా దేశంతో సాధారణ సంబంధాలకు సరిహద్దులో శాంతి, ప్రశాంతత అవసరం” అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ కామెంట్ చేశారు. భారత్ కు చెందిన కాశ్మీర్ విషయంలో చైనా వైఖరిని అందరూ తప్పుపడుతున్నారు. ఇక కాశ్మీర్లో జీ20 సమావేశాలకు టర్కీ, సౌదీ అరేబియా కూడా హాజరు కావడం లేదు. దీనికి కారణం టర్కీ, సౌదీ అరేబియాలతో పాకిస్తాన్ కు సైనిక ఒప్పందాలు ఉన్నాయి. అత్యవసరం అయినప్పుడు అణు బాంబులను తమ రక్షణ కోసం వినియోగించాలనే రహస్య ఒప్పందాన్ని పాకిస్తాన్ తో టర్కీ, సౌదీ అరేబియా కుదుర్చుకున్నాయని అంటారు.