China Laser Guns : చైనా చేతికి మరో సరికొత్త ఆయుధం వచ్చింది. లేజర్ గన్స్ తయారీకి అవసరమైన పరిజ్ఞానాన్ని ఆ దేశ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారంటూ “సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్” ఒక కథనాన్ని ప్రచురించింది. ఈ గన్స్ నుంచి వెలువడే లేజర్ కిరణాలు ఎంత దూరమైనా నిరాటంకంగా ప్రయాణిస్తాయని ఆ కథనంలో పేర్కొన్నారు. ఫ్యూచర్ లో జరిగే యుద్ధాల రూపురేఖలను ఈ లేజర్ గన్స్ మార్చేస్తాయని న్యూస్ స్టోరీలో ప్రస్తావించారు. లేజర్ కిరణాలను ఆయుధాలుగా ప్రయోగించే టెక్నాలజీని చైనాలోని చెంగ్షూలో ఉన్న “నేషనల్ డిఫెన్స్ టెక్నాలజీ” సంస్థ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారని “సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్” తెలిపింది. ఇందుకోసం ప్రత్యేక కూలింగ్ సిస్టమ్‌ను వారు డెవలప్ చేశారని పేర్కొంది.
Also read : Nishkalank Mahadev Temple : నిత్యం అభిషేకం జరిగే శివాలయం ఎక్కడ ఉందో తెలుసా..?
వాస్తవానికి లేజర్ ఆయుధాలు వినియోగించే టైంలో పుట్టుకొచ్చే వేడి అనేది పెద్ద సమస్య. యుద్ధ రంగంలో హైఎనర్జీ లేజర్లను వాడుతున్న సమయంలో పుట్టుకొచ్చే వేడిని తగ్గించడానికి దోహదపడే కెపాసిటీతో కూలింగ్ సిస్టమ్ ను చైనా శాస్త్రవేత్తలు రెడీ చేశారు. శత్రు లక్ష్యాలపై దాడి చేయడానికి అవసరమైనంత దూరం ఈ లేజర్ కిరణాలను పంపొచ్చట. ‘‘ఇది హైఎనర్జీ లేజర్ వ్యవస్థల్లో ఓ విప్లవాత్మక పరిణామం’’ అని నేషనల్ డిఫెన్స్ టెక్నాలజీ శాస్త్రవేత్త యువాన్ షెంగ్ఫూ అన్నారు. ఈ మేరకు విశ్లేషణతో ఆయన రాసిన రీసెర్చ్ పేపర్ ఆగస్టు 4న ‘ఆక్టా ఆప్టిక్ సినికా’ అనే చైనా జర్నల్‌లో(China Laser Guns) పబ్లిష్ అయింది.
Also read : Chandrayaan 3: చంద్రుడికి మరింత చేరువైన చంద్రయాన్ 3.. అడుగుపెట్టబోయేది అప్పుడే?
ఇప్పటికే అమెరికా ..
అమెరికా కూడా హైగ్రేడ్ లేజర్ వ్యవస్థ నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తోంది. నేవీ అడ్వాన్స్‌డ్ కెమికల్ లేజర్, మిడిల్ ఇన్ఫ్రారెడ్ అడ్వాన్స్‌డ్ కెమికల్ లేజర్, టాక్టికల్ హైఎనర్జీ లేజర్, స్పేస్ బేస్డ్ లేజర్ పై రీసెర్చ్ చేస్తోంది. వీటిల్లో కొన్నింటిని అమెరికా ఇప్పటికే పరీక్షించింది. లేజర్ బాంబ్స్ టెక్నాలజీని హైపర్‌సానిక్ క్షిపణులను ధ్వంసం చేయాడానికి వినియోగించాలనే ఆలోచనలో అమెరికా ఉంది. కానీ ఈ లేజర్ల రేంజ్ కొన్ని కిలోమీటర్లు మాత్రమే. కానీ తాజాగా చైనా కనుగొన్న టెక్నాలజీ ప్రకారం లేజర్ రేంజ్ అన్ లిమిటెడ్.