Fake Aadhaar & PAN: టెక్నాలజీ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఒక ప్రత్యేక పాత్రను పోషిస్తోంది. AIని స్వీకరించడం ద్వారా చాలా మంది తమ జీవితాన్ని సులభతరం చేసుకుంటున్నారు. అయితే మోసగాళ్లు దీనిని తప్పుగా (Fake Aadhaar & PAN) ఉపయోగించుకుంటున్నారు కూడా. AIని ఉపయోగించడానికి చాలా మంది ఓపెన్AI చాట్‌జీపీటీని వాడుతున్నారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ ద్వారా ప్రజలు తమ ఫోటోలను ఘిబ్లీ స్టైల్ ఇమేజ్‌లుగా లేదా ఇతర స్టైల్‌లలో మార్చుకుంటున్నారు. అలాగే, సోషల్ మీడియాలో కూడా ఇటువంటి చిత్రాలను ఎక్కువగా షేర్ చేస్తున్నారు.
నకిలీ ఆధార్-పాన్ కార్డ్ తయారీ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ చాట్‌జీపీటీ ద్వారా నకిలీ ఆధార్ కార్డ్‌లు, పాన్ కార్డ్‌లు కూడా తయారవుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. AI ద్వారా నకిలీ భారతీయ గుర్తింపు పత్రాలను తయారు చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో మనీకంట్రోల్.కామ్ తరపున మ్యాక్ యాప్‌లో ఆధార్ ఇమేజ్‌ను సృష్టించే ప్రయత్నం చేసినప్పుడు, చాట్‌జీపీటీ దాన్ని తయారు చేయడానికి నిరాకరించింది.
“ఆధార్ కార్డ్ వంటి అధికారిక పత్రాలను సృష్టించడం లేదా సవరించడం నాకు సాధ్యం కాదు” అని తెలిపింది. అలాగే అధికారిక UIDAI వెబ్‌సైట్‌ను సందర్శించాలని లేదా సమీపంలోని ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లాలని సలహా ఇచ్చింది. అయినప్పటికీ ఈ ఆరోపణలపై పూర్తి స్థాయిలో స్పష్టత రాలేదు. కాబట్టి, మీ పత్రాలను సురక్షితంగా ఉంచడం చాలా అవసరం.
Also Read: CM Revanth Japan Tour: జపాన్ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి.. ఈనెల 15 నుంచి 22 వరకు అక్కడే!
ఈ తప్పులు చేయవద్దు
- మీ పత్రాలను ఎవరితోనూ పంచుకోవద్దు.
- లింక్‌లపై ఆలోచించి క్లిక్ చేయండి.
- ఏదైనా థర్డ్ పార్టీ యాప్‌కు మీ ఫోటో గ్యాలరీకి యాక్సెస్ ఇవ్వవద్దు.
AI ద్వారా ఉత్పత్తి చేయబడిన నకిలీ పాస్‌పోర్ట్, ఆధార్, పాన్ కార్డ్ వంటి పత్రాలు అసలైనవా లేక నకిలీవా అని గుర్తించడానికి, రెండింటి మధ్య తేడాలను జాగ్రత్తగా పరిశీలించండి. ముందుగా పత్రంలో సరైన ఫాంట్‌తో హిందీ లేదా ఇంగ్లీష్‌లో వివరాలు ఉన్నాయా లేదా అని జాగ్రత్తగా చూడండి. ఆ తర్వాత పత్రంలోని ఫోటోను గమనించండి. శ్రద్ధగా పరిశీలిస్తే అసలు, నకిలీ పత్రాల మధ్య తేడాను గుర్తించవచ్చు. ఇతరుల పత్రాలను మీ వద్ద జమ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా పరిశీలించండి.