Solar Rooftop Scheme : ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన సంచలన పథకం పేరు.. ‘ప్రధానమంత్రి సూర్యోదయ యోజన’. దీన్నే ‘సోలార్ రూఫ్ టాప్ స్కీమ్ – 2024’(Solar Rooftop Scheme) అని పిలుస్తారు. ఈ స్కీమ్ ద్వారా భారతీయులు తమ ఇళ్లపై సోలార్ ప్యానళ్లను ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ సోలార్ ప్యానళ్లు ఉత్పత్తి చేసే విద్యుత్‌ను తమ ఇంటి అవసరాలకు ఉచితంగా వాడుకోవచ్చు. దీనివల్ల కరెంటు బిల్లుల సమస్య పోతుంది. అదనపు విద్యుత్‌ని ఉత్పత్తి చేస్తే ప్రభుత్వానికి అమ్ముకోవచ్చు. మీరు కూడా ఈ పథకం కోసం solarrooftop.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చు.
We’re now on WhatsApp. Click to Join.
- ఈ పథకానికి అప్లై చేసేవారి సంవత్సర ఆదాయం రూ.2 లక్షల కంటే తక్కువ ఉండాలి.
- ఇంటిపైన సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసేందుకు సరిపడా ఖాళీ జాగా ఉండాలి.
- ఇప్పటివరకూ ఏ పథకం కిందా సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకొని ఉండకూడదు.
- ఆ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి అయివుండకూడదు.
- ఆధార్ కార్డు, అడ్రెస్ ప్రూఫ్, ఐడెంటిటీ కార్డు, ఫ్యామిలీ రేషన్ కార్డు, ఆదాయ సర్టిఫికెట్, బ్యాంక్ పాస్‌బుక్, మొబైల్ నంబర్, పాస్‌పోర్ట్ సైజు ఫొటో, విద్యుత్ బిల్లు కలిగివుండాలి.
అప్లై చేసుకునే పద్ధతి ఇదీ..
‘ప్రధానమంత్రి సూర్యోదయ యోజన’ కింద అప్లై చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన అధికారిక వెబ్‌సైట్ solarrooftop.gov.in లోకి వెళ్లాలి. అక్కడ ఎడమవైపున Apply For Rooftop Solar అనే ఆప్షన్‌పై క్లిక్ చెయ్యాలి. అనంతరం మీరు ఉంటున్న రాష్ట్రం, జిల్లా, పవర్ కంపెనీ వివరాలు, వినియోగదారు అకౌంట్ నంబర్‌తో రిజిస్టర్ కావాలి. తర్వాత అవసరమైన పత్రాలను అన్నింటినీ అప్‌లోడ్ చేయాలి. తర్వాత అప్లికేషన్‌ను సబ్మిట్ చేయాలి. ఇలా రిజిస్టర్ అయినవారు ఆ తర్వాత తమ మొబైల్ నంబర్‌ను ఉపయోగించి solarrooftop.gov.in లోకి లాగిన్ కావచ్చు. ఈ పథకం ద్వారా సోలార్ ప్యానెళ్లు వేయించుకునేవారికి కేంద్రం 30 శాతం నుంచి 70 శాతం దాకా సబ్సిడీ ఇస్తోంది. అయితే ఈ సబ్సిడీ ఆయా రాష్ట్రాల వారీగా వేర్వేరుగా ఉంటుంది. ఒక్కో ఇంటికీ మాగ్జిమం 10 kW కెపాసిటీ సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేస్తారు. అప్లికేషన్ పెట్టుకున్న 15 నుంచి 20 రోజుల్లో పరిశీలించి, అర్హత ఉన్నవారికి సోలార్ ప్యానెళ్లను కేంద్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది.