40 మొసళ్ళు (40 Crocodiles Attack) కలిసి ఒక వ్యక్తిపై అటాక్ చేశాయి.. అతడిని చీల్చి చెండాడాయి. ఒక చేతిని కొరికి తినేశాయి. రక్తసిక్తం చేసి.. అతడిని చంపాయి. ఇంతకీ ఈ ఘటన ఎలా జరిగింది ? అతడు మొసళ్ళకు ఎలా చిక్కాడు ? ఎక్కడ చిక్కాడు ? అనేది తెలియాలంటే ఈ మొత్తం వార్తను చదవాల్సిందే !!
కంబోడియా దేశంలోని సియెమ్ రీప్ (Siem Reap) టౌన్ అది. మన దేశంలో చేపల చెరువులు ఉన్నట్టే.. సియెమ్ రీప్ టౌన్ లో మొసళ్ళ చెరువులు ఉంటాయి. అక్కడ ఉపాధి కోసం ఎంతోమంది మొసళ్ళ పెంపకాన్నిచేపడుతుంటారు. ఎందుకంటే.. మొసళ్ళ గుడ్లు, చర్మం, ,మాంసానికి కంబోడియా దేశంలో చాలా డిమాండ్ ఉంటుంది. ఈక్రమంలోనే సియెమ్ రీప్ టౌన్ లో మొసళ్ళ చెరువు నిర్వహించే ఒక వృద్ధుడు(72).. రోజులాగే పనుల్లో నిమగ్నమయ్యాడు.
Also read : Viral Video: పొలంలో హార్వెస్టర్ యంత్రంపై మొసలి దాడి.. వైరల్ అవుతున్న వీడియో..!
బోను గోడ పైన నిలబడి..
ఒక బోనులో మొసలి గుడ్లు పెట్టిన తర్వాత .. దాన్ని బోను నుంచి బయటికి పంపేందుకు అతడు ట్రై చేశాడు. గుడ్లు పెట్టాక బోనులోనే మత్తుగా నిద్రపోతున్న మొసలిని.. బోను గోడ పైన నిలబడి కర్రతో తట్టాడు. దీంతో ఆ మొసలి కర్రను నోటితో తన వైపుకు లాగింది . దీంతో ఆ వృద్ధుడు వెళ్లి .. మొసలి బోను లో పడిపోయాడు. ఆ తర్వాత మొసళ్ళు ఒక్కటొక్కటిగా అతడి చుట్టూ చేరాయి. మొత్తం 40 మొసళ్ళు (40 Crocodiles Attack) వృద్ధుడిపై విరుచుకుపడి చంపాయని స్థానిక పోలీసులు తెలిపారు. 2019లో ఇదే గ్రామంలో రెండేళ్ల బాలికను మొసళ్లు చంపి తిన్నాయని గుర్తు చేశారు.