Site icon HashtagU Telugu

Byjus Vacate : అద్దె కట్టలేక అతిపెద్ద ఆఫీస్ ఖాళీ చేసిన ‘బైజూస్’

Loss-Making Companies

ED Raids on Byjus CEO Ravindran office and house

Byjus Vacate : దేశంలోని ప్రముఖ ఎడ్ టెక్ కంపెనీ ‘బైజూస్’ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకొని విలవిలలాడుతోంది. చివరకు ఆఫీసుల అద్దెలు కూడా కట్టలేని స్థితికి  ‘బైజూస్’ చేరుకుంది. ఈ కంపెనీ ఇప్పటికే పలు ఆఫీసుల్ని ఖాళీ చేసింది. తాజాగా బెంగళూరులో మరో పెద్ద ఆఫీసును ఖాళీ చేసేసింది. నగరంలోని ప్రెస్టైజ్ టెక్ పార్కులో ఉన్న 4 లక్షల చదరపు అడుగుల మేర విస్తరించి ఉన్న ఆఫీస్ స్పేస్‌ను వదిలేసింది. అద్దె కట్టలేక బైజూస్ ఇలా చేసింది. కంపెనీ నిర్వహణకు సరిపడా నిధులు లేక.. ఆఫీసుల సంఖ్యను ఈవిధంగా తగ్గిస్తోంది. ప్రెస్టైజ్ టెక్ పార్కులో ఉన్న బైజూస్ ఆఫీసు బిల్డింగ్  రెంటల్ అగ్రిమెంట్‌ను ఈ ఏడాది ఆరంభంలోనే రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. గత రెండు నెలలుగా అద్దె చెల్లించకుండా..  ముందే చెల్లించిన డిపాజిట్‌తో సర్దుబాటు చేసుకున్నట్లు సమాచారం. దేశంలోని మరికొన్ని చోట్ల కూడా బైజూస్  సంస్థ(Byjus Vacate) ఇదేవిధంగా అద్దె కార్యాలయాలను ఖాళీ చేస్తోంది.

We’re now on WhatsApp. Click to Join

బెంగళూరులో ప్రెస్టైజ్ గ్రూప్‌తో మూడున్నర సంవత్సరాల కిందట ఆఫీస్ స్పేస్ కోసం బైజూస్ ఒప్పందం కుదుర్చుకుంది. రెంటల్ అగ్రిమెంట్లో భాగంగా నెలకు రూ. 4 కోట్లు అద్దె కట్టాలి.  ప్రస్తుతం కంపెనీ అప్పుల ఊబిలో ఉంది. దీంతో అంత భారీ అప్పులు కట్టడం కంపెనీకి పెద్ద సవాలుగా మారింది. బెంగళూరులో ఉన్న కల్యాణి టెక్ పార్కులోని 5 లక్షల చదరపు అడుగుల మేర విస్తరించి ఉన్న ఓ ఆఫీసు అద్దెను కూడా బైజూస్ గత 10 నెలలుగా చెల్లించడం లేదట. దీంతో బైజూస్‌కు కల్యాణి డెవలపర్స్ లీగల్ నోటీసులు పంపారు. 2025 మార్చితో అక్కడి ఆఫీసు అగ్రిమెంట్ ముగుస్తుంది.  ముందస్తు డిపాజిట్‌తో 7 నెలల అద్దెను బైజూస్ సర్దుబాటు చేసుకుంటుందని సమాచారం.

Also Read : Marathas Reservation : మరాఠాలకు10 శాతం రిజర్వేషన్.. బిల్లుకు కేబినెట్ ఆమోదం

‘బైజూస్’ సంక్షోభంపై సమాచారం .. 

Also Read : IRCTC iPay Autopay : డబ్బులు కట్ కాకుండానే టికెట్.. ఐఆర్‌సీటీసీ ‘ఐపే ఆటోపే’ ఫీచర్