Billionaire To Zero : బిలియనీర్ జీరో అయ్యాడు.. బైజూస్ అధినేత నెట్ వర్త్ ‘జీరో’ !
Billionaire To Zero : ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు కావడం అంటే ఇదే !! ఈ నానుడి ప్రముఖ ఎడ్‌టెక్ సంస్థ బైజూస్ సహ వ్యవస్థాపకుడు బైజు రవీంద్రన్ కెరీర్‌కు నూటికి నూరుశాతం సరిపోతుంది.
Pasha
Published By: HashtagU Telugu Desk
ED Raids on Byjus CEO Ravindran office and house
Share The Story :
Billionaire To Zero : ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు కావడం అంటే ఇదే !! ఈ నానుడి ప్రముఖ ఎడ్‌టెక్ సంస్థ బైజూస్ సహ వ్యవస్థాపకుడు బైజు రవీంద్రన్ కెరీర్‌కు నూటికి నూరుశాతం సరిపోతుంది. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఆయన..ఇప్పుడు వెలవెలబోతున్నారు. తాజాగా విడుదల చేసిన ‘ఫోర్బ్స్ వరల్డ్స్ బిలియనీర్స్ లిస్ట్ 2024’ ప్రకారం ఆయన ఆస్తుల నికర విలువ సున్నా. సరిగ్గా ఏడాది క్రితం ఆయన నికర సంపద విలువ రూ. 17,545 కోట్లు. నాటికి నేటికి.. ఆయన సంపద(Billionaire To Zero) ఎంతలా కరిగిపోయిందో దీన్నిబట్టి మనం అర్థం చేసుకోవచ్చు.
ఈ పరిణామాలతో బైజూస్ అప్పుల కుప్పలో మునిగిపోయింది.
2021 సంవత్సరంలో కంపెనీకి రూ.2.70 లక్షల కోట్ల నష్టాలు వచ్చాయి.
ఈనేపథ్యంలో ఒకప్పుడు రూ.1.82 లక్షల కోట్లుగా ఉన్న బైజూస్ విలువను ఇటీవల ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ బ్లాక్‌రాక్ రూ.8,266 కోట్లకు తగ్గించింది.
ఈ ఏడాదిలో ఫిబ్రవరి 23న కంపెనీ వాటాదారులంతా కలిసి రవీంద్రన్‌ను బైజూస్ సీఈఓ పదవి నుంచి తొలగించారు.
అయితే తనపై కంపెనీ బోర్డు చేసిన ఆరోపణలను బైజు రవీంద్రన్, ఆయన కుటుంబం ఖండించింది. అంతర్గత కంపెనీ చట్టాలను ఈ సమావేశం ఉల్లంఘించిందని, కనీసం ఒక వ్యవస్థాపక డైరెక్టర్ ఈజీఎంలో ఉండాలని తెలిపింది.
బైజూస్ సీఈఓ పదవి నుంచి తనను తొలగించడాన్ని కోర్టులో సవాలు చేస్తానని అప్పట్లో రవీంద్రన్ ప్రకటించారు.
డబ్బులు లేకపోవడంతో వేతనాలు చెల్లించలేక.. చాలామంది ఉద్యోగులను బైజూస్ ఇప్పటికే తొలగించింది.