ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండల కేంద్రానికి చెందిన పాడి రైతు కాసబోయిన నానయ్యకు చెందిన ఓ గేదెను (Buffalo Tension) రెండు నెలల క్రితం కుక్క కరిచింది. ఈ విషయం ఎవరికీ చెప్పకుండా గ్రామంలోని వందలాది మందికి ఆ గేదె పాలను నానయ్య విక్రయించారు. అయితే రెండు రోజుల క్రితం కుక్క కరిచిన గేదె దూడ (Buffalo Tension) చనిపోయింది. ఈ విషయం నానయ్య దగ్గర పాలు కొనేవాళ్లకి తెలియడంతో భయపడ్డారు. నానయ్య దగ్గర పాలు కొనే వాళ్లంతా ఊరిలోని ఆస్పత్రి దగ్గరికి పరుగులు పెట్టారు. పాలు తాగిన 302 మంది గ్రామస్తులు యాంటీ రేబిస్ వ్యాక్సిన్‌ను వేయించుకున్నారు. ఇలా యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో మండల అధికారులు కూడా ఉండడం గమనార్హం.
ALSO READ : Viral Dance Video: గేదె ముందు డాన్స్ చేసిన యువతి.. అది చేసిన పనికి నవ్వుకుంటున్న నెటిజన్స్?
పాలను వేడి చేసిన తర్వాత తాగితే ఎలాంటి ప్రమాదం ఉండదని వెటర్నరీ వైద్యులు తెలిపారు. అయితే దూడ పొదుగు దగ్గర కుక్క కరిచి ఉంటే .. పాలు విషపూరితమయ్యే ముప్పు ఉంటుందన్నారు. ముందస్తుగా యాంటీ రేబిస్ టీకాలు వేయించుకోవడం మంచిదని సూచించారు.కాగా, గేదె పాలు తాగిన దూడ అయితే చనిపోయింది. కుక్క కరిచిన గేదెకు మాత్రం ఎలాంటి ప్రమాదం కాలేదు. దూడ అనారోగ్యం కారణంగానే చనిపోయి ఉంటుందని చెబుతున్నారు.