Site icon HashtagU Telugu

kadiyam srihari : పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే బీఆర్ఎస్ : కడియం శ్రీహరి

Kadiyam Srihari

Kadiyam Srihari

By-election: ఉపఎన్నికపై స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. స్టేషన్‌ఘనపూర్‌కు ఉప ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే బీఆర్ఎస్ అని అన్నారు. ఏకంగా శాసనసభ పక్షాలను కలుపుకున్న చరిత్ర బీఆర్ఎస్‌దని వ్యాఖ్యలు చేశారు. ఇప్పట్లో ఉప ఎన్నిక రావని… వచ్చినా ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. స్టేషన్ ఘనపూర్‌లో ఎన్నికలు వస్తే… బీఆర్ఎస్‌కు డిపాజిట్లు కూడా రావని జోస్యం చెప్పారు. కోర్టులపై, ప్రజాస్వామ్యంపై తమకు గౌరవం ఉందన్నారు. వరంగల్ చరిత్రను కనుమరుగు చేసేందుకే ఉమ్మడి జిల్లాను కేసీఆర్ ఆరు ముక్కలు చేశారని.. ఇది అడిగినందుకే తనకు రెండోసారి మంత్రి పదవి ఇవ్వలేదని తెలిపారు. కేసీఆర్ కుటుంబం చేతిలో తెలంగాణ బంధి అయిందని కడియం శ్రీహరి విమర్శలు గుప్పించారు.

Read Also: New Maruti Dzire: మార్కెట్‌లోకి మారుతి డిజైర్ కొత్త కారు.. లాంచ్ ఎప్పుడంటే..?

కాగా… రాష్ట్రంలో ఉపఎన్నికలు రాబోతున్నాయంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదేపదే చెబుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కీలక అసెంబ్లీ స్థానం స్టేషన్‌ఘనపూర్‌కు త్వరలో ఉపఎన్నిక వస్తుందని కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ ఎన్నికల్లో తాటికొండ రాజయ్య విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అయితే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ విజయం సాధించింది. బీఆర్ఎస్ నుంచి కడియం శ్రీహరి పోటీచేసి విజయం సాధించారు. కానీ 2024 పార్లమెంట్ ఎన్నికల సమయానికి కడియం పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. కడియం శ్రీహరికి బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కడియంతో పాటు పలువురు బీఆర్‌ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. వారిపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్‌ఎస్‌ పార్టీ హైకోర్టులో పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే.

Read Also: Star Health Vs Telegram : టెలిగ్రాంపై స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ దావా.. ఎందుకంటే ?

Exit mobile version