Bride And Groom Die : కొత్తగా పెళ్లైన ఆ వధూవరులకు శోభనం రాత్రే కాళరాత్రి అయింది. వాళ్లిద్దరూ అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఈ విషాద ఘటన యూపీలోని గోధియా గ్రామంలో చోటుచేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసి ప్రాథమిక దర్యాప్తు జరిపిన పోలీసులు ఆ వధూవరులు గుండెపోటుతో చనిపోయారని తేల్చారు. గ్రామానికి చెందిన ప్రతాప్ యాదవ్ (24).. పుష్ప యాదవ్ (22) ను మే 30న పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయిన రెండ్రోజుల తర్వాత (జూన్ 1న) రాత్రి వారిద్దరి శోభనానికి ఏర్పాట్లు చేశారు. ఆ రోజు రాత్రి వధూవరులు(Bride And Groom Die) గదిలోకి వెళ్లారు.తెల్లారి ఎంతకీ తలుపు తియ్యలేదు.
Also read : Groom Death: శోభనం గదిలో వరుడు మృతి!
దీంతో కుటుంబ సభ్యులు తలుపు తట్టారు. ఎంతకీ తియ్యకపోవడంతో బలవంతంగా తలుపులు తెరిచారు. చూస్తే… ఇద్దరూ చనిపోయి కనిపించారు. దీంతో వారి మరణాలపై రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించగా.. వారిద్దరికీ గదిలో ఊపిరాడక చనిపోయారని తేలింది. ఆ గదిలో గాలి ఆడనంత పరిస్థితి ఎందుకొచ్చిందనేది తెలియాల్సి ఉంది. ఇక వధూవరులకు ఒకే చితిపై దహన సంస్కారాలతో అంత్యక్రియలు నిర్వహించారు.