BMW Group- Tata Technologies: టాటాలతో చెయ్యి కలిపిన బీఎండబ్ల్యూ.. ఎందుకో తెలుసా ?

జర్మన్ ఆటోమోటివ్ తయారీదారు BMW గ్రూప్, గ్లోబల్ ప్రొడక్ట్ ఇంజనీరింగ్.. డిజిటల్ సేవల సంస్థ టాటా టెక్నాలజీస్ (BMW Group- Tata Technologies) భారతదేశంలో ఆటోమోటివ్ సాఫ్ట్‌వేర్, IT డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయనున్నాయి.

  • Written By:
  • Updated On - April 2, 2024 / 11:49 PM IST

BMW Group- Tata Technologies: జర్మన్ ఆటోమోటివ్ తయారీదారు BMW గ్రూప్, గ్లోబల్ ప్రొడక్ట్ ఇంజనీరింగ్.. డిజిటల్ సేవల సంస్థ టాటా టెక్నాలజీస్ (BMW Group- Tata Technologies) భారతదేశంలో ఆటోమోటివ్ సాఫ్ట్‌వేర్, IT డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయనున్నాయి. కంపెనీల సంయుక్త ప్రకటన ప్రకారం.. పూణె, బెంగళూరు, చెన్నైలలో ఆటోమోటివ్ సాఫ్ట్‌వేర్, ఐటి డెవలప్‌మెంట్ సెంటర్‌లను ఏర్పాటు చేయడానికి జాయింట్ వెంచర్ (జెవి) ఏర్పాటుకు ఇరు సంస్థ‌లు ఒప్పందం కుదుర్చుకున్నాయి.

ప్రధాన అభివృద్ధి, కార్యాచరణ కార్యకలాపాలు బెంగళూరు, పూణేలలో నిర్వహించబడతాయి. చెన్నైలో వ్యాపార ఐటీ సొల్యూషన్స్‌పై దృష్టి సారించనున్నారు. టాటా టెక్నాలజీస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO), మేనేజింగ్ డైరెక్టర్ (MD) వారెన్ హారిస్ మాట్లాడుతూ.. BMW గ్రూప్‌తో మా సహకారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు ఆటోమోటివ్ సాఫ్ట్‌వేర్, డిజిటల్ ఇంజనీరింగ్‌లో అగ్రశ్రేణి పరిష్కారాలను అందించడానికి మా నిబద్ధతను ప్రతిబింబిస్తుందని తెలిపారు. బిఎమ్‌డబ్ల్యూ గ్రూప్ సాఫ్ట్‌వేర్, ఈఈ ఆర్కిటెక్చర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ క్రిస్టోఫ్ గ్రూట్ మాట్లాడుతూ.. టాటా టెక్నాలజీస్‌తో సహకారం సాఫ్ట్‌వేర్ ఆధారిత వాహనాల రంగంలో బిఎమ్‌డబ్ల్యూ పురోగతిని వేగవంతం చేస్తుందని అన్నారు.

Also Read: AP : మండుటెండలో చల్లటి వార్త.. వేసవి సెలవుల ప్రకటన

ఇంకా మాట్లాడుతూ.. BMW గ్రూప్ కోసం వెహికల్ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయడం అంటే టాప్-క్లాస్ ప్రాసెస్‌లు, టూల్స్‌తో పనిచేయడం అని, ఇది భారతీయ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు అత్యంత ఆటోమేటెడ్ వంటి భవిష్యత్తు రంగాలలో అత్యాధునిక, ప్రీమియం ఆటోమోటివ్ అనుభవాలను రూపొందించే అవకాశాన్ని ఇస్తుందని ఆయన అన్నారు.

అయితే, ఒప్పందం నిర్దిష్ట ఆర్థిక వివరాలు వెల్లడించలేదు. ఈ భాగస్వామ్యం కింద టాటా టెక్నాలజీస్, BMW గ్రూప్ కొత్తగా స్థాపించబడిన కంపెనీలో ఒక్కొక్కటి 50% వాటాను కలిగి ఉంటాయి. టాటా మోటార్స్ అనుబంధ సంస్థ అయిన టాటా టెక్నాలజీస్ ఆటోమోటివ్, ఏరోస్పేస్ భారీ యంత్రాల తయారీదారులకు ఇంజనీరింగ్ మరియు సాంకేతిక సేవలను అందించడంలో ప్రత్యేకత కలిగి ఉంది.

We’re now on WhatsApp : Click to Join