ప్రసిద్ధ వ్యాపారవేత్త జెఫ్ బెజోస్‌కు చెందిన ‘బ్లూ ఆరిజన్’ (Blue Origin) సంస్థ మరో ఘనతను సాధించేందుకు సిద్ధమవుతోంది. నేడు న్యూషెపర్డ్ రాకెట్ ద్వారా ఆరుగురు మహిళలను అంతరిక్షం(Space)లోకి పంపనుంది. ఈ ప్రయోగం టెక్సాస్‌లోని ప్రయోగ కేంద్రం నుంచి ఉదయం 7 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మిషన్‌లో ప్రముఖులు కూడా పాల్గొనడం విశేషం.
Post Marriage Depression: వివాహం తర్వాత డిప్రెషన్‌తో బాధపడుతున్నారా? అయితే ఈ టిప్స్ మీకోసమే!
ఈ అంతరిక్ష యాత్రలో జెఫ్ బెజోస్ ప్రేయసి లారెన్ సాంచెజ్, ప్రముఖ పాప్ గాయని కేటీ పెర్రీ (Katy Perry) సహా మరో నలుగురు మహిళలు పాల్గొంటున్నారు. వారు భూమి మరియు అంతరిక్ష మధ్య ఉన్న కర్మన్ రేఖను దాటి జీరో గ్రావిటీ అనుభూతిని పొందనున్నారు. ఇది ప్రపంచంలోని కొన్ని అరుదైన అనుభవాలలో ఒకటిగా భావించబడుతుంది. ఈ యాత్ర సమయంలో వారు అక్కడి నుంచి భూమిని నేరుగా చూడగలగడం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
ఈ మొత్తం మిషన్ సుమారు 11 నిమిషాల పాటు కొనసాగనుంది. మహిళలంతా రాకెట్‌లో ప్రయాణించనున్న తొలిసారి కావడంతో ఈ ప్రయోగం చరిత్రలో ప్రత్యేక స్థానం దక్కించుకోనుంది. మహిళల సాధికారతకు, అంతరిక్ష పరిశోధనలో వారి పాత్రకు ఇది మరొక నిదర్శనంగా నిలుస్తోంది. ‘బ్లూ ఆరిజన్’ సంస్థ భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచే ఈ మిషన్ ద్వారా మరో మైలురాయిని అధిగమించింది.