kiss cafe : కిస్ కేఫ్.. ఖేల్ ఖతం

బ్లూ బాటిల్ కేఫ్ (బీబీసీ) అనే పదం ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. కేఫ్ అనే పదాన్ని చూసి మోసపోకండి.. ఇది చాయ్ , కాఫీ దొరికే సాదా సీదా కేఫ్ కాదు !! ఈ కేఫ్.. ముద్దు పెట్టుకోవాలి (kiss cafe) అనుకునే వాళ్ళ కోసమట !!

  • Written By:
  • Publish Date - May 13, 2023 / 07:31 AM IST

బ్లూ బాటిల్ కేఫ్ (బీబీసీ) అనే పదం ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. కేఫ్ అనే పదాన్ని చూసి మోసపోకండి.. ఇది చాయ్ , కాఫీ దొరికే సాదా సీదా కేఫ్ కాదు !! ఈ కేఫ్.. ముద్దు పెట్టుకోవాలి (kiss cafe) అనుకునే వాళ్ళ కోసమట !! సమాజాన్ని, యూత్ ను పెడదోవ పట్టించే ఈ పిచ్చి కాన్సెప్ట్ తో మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో బ్లూ బాటిల్ కేఫ్ స్టార్ట్ అయింది. ఈ కేఫ్ లోని క్యాబిన్ లో ఒక గంటపాటు కిస్ (kiss cafe) చేసుకునేందుకు రూ.99 ఫీజును కేఫ్ నిర్వాహకులు వసూలు చేస్తున్నారట. “ముద్దు పెట్టుకోవడానికి స్థలం లేకపోతే, మా ప్లేస్‌కు రండి, కిస్సింగ్ క్యాబిన్ సేవను వాడుకోండి” అనే వీడియో అడ్వర్టైజ్మెంట్ ను కూడా కేఫ్‌ నిర్వాహకులు రన్ చేస్తున్నారట.

also read : Husband Kiss: ముద్దు పెట్టుకున్నందుకు విడాకులు ఇచ్చేసిన భార్య

kiss cafe వీడియో యాడ్‌ పై అభ్యంతరాల వెల్లువ.. 

బ్లూ బాటిల్ కేఫ్ వీడియో యాడ్‌ పై, ఈ కేఫ్ లోని క్యాబిన్ల దందాపై చాలామంది పెదవి విరుస్తున్నారు. ఇలాంటి కేఫ్ లు భారత్ సంస్కృతికి విరుద్ధం అని వాదిస్తున్నారు. దీనిపై ట్విట్టర్ వేదికగా నెటిజన్స్ మధ్య హాట్ డిబేట్ జరుగుతోంది. ఇలాంటి కేఫ్ లు పెరిగితే ఫ్యూచర్ జనరేషన్స్ కు ఇబ్బందే అని చాలామంది అభిప్రాయపడ్డారు. సిటీలో చదివించేందుకు పిల్లలను పంపే తల్లిదండ్రులు బ్లూ బాటిల్ కేఫ్ వీడియో యాడ్ చూస్తే కలత చెందుతారని ఇంకొందరు అంటున్నారు. “ప్రేమ జంటకు క్యాబిన్ ఆఫర్? ఇది ఆకర్షణీయమైన ఆఫర్ కాదా? ” అంటూ ఇంకొందరు ఈ కేఫ్ బిజినెస్ థీమ్ ను సపోర్ట్ చేస్తూ కామెంట్స్ పెట్టారు. చాలామంది అభ్యంతరకరంగా ఉన్న బ్లూ బాటిల్ కేఫ్ (బీబీసీ) వీడియో యాడ్ ను మధ్యప్రదేశ్ హోంమంత్రికి ట్యాగ్ చేశారు. ఆ కేఫ్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేరింది. కేఫ్ యజమాని దీపేష్ జైన్‌పై కేసు నమోదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన తర్వాత అశ్లీలతను వ్యాప్తి చేసే అన్ని కేఫ్‌లు, రెస్టారెంట్లపై చర్యలు తీసుకుంటామని ఇండోర్ పోలీసులు వెల్లడించారు.