Site icon HashtagU Telugu

MLA Muniratna Naidu : బీజేపీ ఎమ్మెల్యే పై కోడిగుడ్లతో దాడి

BJP MLA attacked with chicken eggs

BJP MLA attacked with chicken eggs

MLA Muniratna Naidu : కర్ణాటక మాజీ మంత్రి, రాజరాజేశ్వరి నగర్ ఎమ్మెల్యే, బీజేపీ నేత‌ మునిరత్న నాయుడి పై కొంద‌రూ గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు కోడిగుడ్లతో దాడి చేశారు. ఆర్‌ఆర్‌ నగర పరిధిలోని లక్ష్మిదేవి నగర్‌ వార్డు బీజేపీ కార్యాలయంలో వాజ్‌పేయి జయంతిలో పాల్గొనేందుకు వెళ్తున్న ఎమ్మెల్యేపై గుడ్లతో దాడి చేశారు. నందిని పోలీస్‌స్టేషన్‌ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఆందోళనకారులు ముగ్గురిని అరెస్టు చేశారు. ఇదే సందర్భంగా ఎమ్మెల్యే మునిరత్న రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు.

ఈ ఘ‌ట‌న‌పై మునిర‌త్న స్పందిస్తూ..బీజేపీ కార్యకర్తలు, నా అభిమానులు, పోలీసులు లేనిపక్షంలో హతమార్చేవారన్నారు. వారి దాడి వెనుక కుట్ర ఉందన్నారు. స్థానిక కాంగ్రెస్‌ నాయకురాలు కుసుమ, ఆమె తండ్రి హనుమంతరాయప్పలు కుట్ర పన్నార న్నారు. డీసీఎం డీకే శివకుమార్‌, ఆయన సోదరుడు డీకే సురేశ్‌లు నన్ను హత్య చేసేందుకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించారని ఆరోపించారు. ఎమ్మెల్యే మునిరత్నపై దాడిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర తీవ్రంగా ఖండించారు.

ఇటువంటి దాడుల వెనుక ప్రత్యర్థులు ఏమి ఆశిస్తున్నారనేది అర్థం అవుతుందన్నారు. సువర్ణసౌధలో ఎమ్మెల్సీ సీటీ రవి పై దాడి చేశారని, సొంత నియోజకవర్గంలో తిరుగుతున్న ఎమ్మెల్యేపై దాడిని ఏమని అర్థం చేసుకోవాలన్నారు. కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషి తీవ్రంగా మండిపడ్డారు. పోలీసులు ఇటువంటి కేసులలో నిర్లక్ష్యం చేయరాదన్నారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వైర‌ల్‌గా మారాయి.

Read Also: Virat Kohli: విరాట్ కోహ్లీకి మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించిన ఐసీసీ