AESL : పరీక్షా సిద్ధత సేవలలో దేశీయ నాయకుడైన ఆకాశ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ (AESL), ప్రతిభావంతులైన ఇంజనీరింగ్ అభ్యర్థుల కోసం రూపొందించిన ఆకాశ్ ఇన్‌విక్టస్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. ఈ విప్లవాత్మకమైన, అధునాతన,AI ఆధారిత, వ్యక్తిగతీకరించిన, ఫలితాలపై కేంద్రీకృత కార్యక్రమం IITలు లేదా ప్రఖ్యాత అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో చేరాలనుకునే విద్యార్థులకు అనుకూలంగా రూపొందించబడింది.
Read Also: YCP : మరోసారి వంశీని కస్టడీకి కోరుతూ పోలీసుల పిటిషన్
ఆకాశ్ ఇన్‌విక్టస్ దాదాపు 500 మంది అత్యుత్తమ . లక్షకు పైగా విద్యార్థులను IITలలో ప్రవేశం పొందేందుకు మార్గనిర్దేశం చేసిన JEE ఫ్యాకల్టీసభ్యులను ఒకచోట చేర్చి అసాధారణమైన రీతిలో మెంటార్షిప్‌ను అందిస్తోంది. ఈ కోర్సు అత్యాధునికమైనది మరియు IITల్లో టాప్ ర్యాంకులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రతిభావంతమైన విద్యార్థులకు ప్రత్యేకంగా రూపొందించబడింది. ప్రోగ్రామ్‌లో సమగ్ర ఫిజిటల్ లెర్నింగ్ మరియు ప్రత్యేక అధ్యయన వనరులు ఉన్నాయి, ఇవి ఖచ్చితమైన,AI ఆధారిత, మరియు JEE అడ్వాన్స్‌డ్‌కు అనుకూలమైన ప్రిపరేషన్‌ను నిర్ధారిస్తాయి.
ఈ కఠినమైన ప్రోగ్రామ్‌లో JEE(అడ్వాన్స్‌డ్) పరీక్షకు ముందు చివరి దశలో లక్ష్యంతో కూడిన ప్రిపరేషన్‌కు ప్రాధాన్యత ఇచ్చే సమగ్ర రివిజన్ మరియు పరీక్ష మాడ్యూల్ అందించబడుతుంది. విద్యార్థులకు ప్రత్యేకమైన సిలబస్, సందేహాల నివృత్తి సెషన్లు మరియు వారి ప్రదర్శనను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేలా జాగ్రత్తగా రూపొందించిన టెస్ట్ సిరీస్ అందించబడుతుంది. విద్యార్థులకు మరింత వ్యక్తిగతీకరించిన శ్రద్ధను అందించడానికి ఆకాశ్ ఇన్‌విక్టస్ చిన్న బ్యాచ్‌లను కలిగి ఉంటుంది.
ఆకాశ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ యొక్క MD&CEO దీపక్ మెహ్రోత్రా ఈ ప్రోగ్రామ్ ప్రాముఖ్యతపై మాట్లాడుతూ.. “ఆకాశ్ ఇన్‌విక్టస్ కేవలం కోచింగ్ ప్రోగ్రామ్ కాదు; ఇది IITల్లో టాప్ ర్యాంకులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థుల కోసం ఒక మార్గదర్శక ప్రయాణం. ఈ ప్రోగ్రామ్ దశాబ్దాల అనుభవం కలిగిన అత్యుత్తమ ఫ్యాకల్టీని, ఆధునిక బోధనా విధానాలను, వ్యక్తిగతీకరించిన, AI, సాంకేతిక ఆధారిత అభ్యాసంను ఒకచోట చేర్చింది. మా విద్యావేత్తలు లక్షలాది మంది విద్యార్థులను IITల్లో ప్రవేశం పొందేందుకు విజయవంతంగా మెంటర్ చేశారు. మా స్టడీ మెటీరియల్‌ను పూర్తిగా నూతనీకరించాం, ఇది మొత్తం సిలబస్‌ను కవర్ చేస్తూ, పరిశ్రమలోని అత్యుత్తమ నిపుణులచే అభివృద్ధి చేయబడింది. మీరు దీన్ని మించిన మెటీరియల్ రూపొందించగలిగితే, మేము మిమ్మల్ని సన్మానించి మా బృందంలో ఆహ్వానిస్తాం” అని అన్నారు.