Fengal Typhoon : ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్‌.. పలు విమానాలు రద్దు

ఈ సమాచారం మేరకు ప్రయాణికులు ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని సూచించింది. వర్షాలు తగ్గిన తర్వాత విమానాలను యాథావిథిగా నడపనున్నట్లు వెల్లడించింది.

Published By: HashtagU Telugu Desk
Bengal typhoon effect.. Many flights are cancelled

Bengal typhoon effect.. Many flights are cancelled

Fengal Typhoon : తమిళనాడులో ఫెంగల్ తుఫాన్ కారణంగా భారీ వర్షం కురుస్తోంది. దీంతో చెన్నైలో రైల్వే, బస్ స్టేషన్లలో వర్షపు నీరు చేరింది. ఎయిర్‌పోర్ట్‌ ప్రాంతం కూడా తడిగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వాతావరణం సరికా లేకపోవడంతో అప్రమత్తమైంది. తెలంగాణ, ఏపీ, తమిళనాడు మధ్య నడిచే పలు విమాన సర్వీసులను రద్దు చేసింది. చెన్నై-విశాఖ-చెన్నై, తిరుపతి-విశాఖ-తిరుపతి విమానాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. హైదరాబాద్-తిరుపతికి వెళ్లాల్సిన 7 విమానాలు, చెన్నై-హైదరాబాద్ వెళ్లాల్సిన 3 విమనాలను రద్దు చేస్తూ ప్రకటన విడుదల చేసింది. ఈ సమాచారం మేరకు ప్రయాణికులు ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని సూచించింది. వర్షాలు తగ్గిన తర్వాత విమానాలను యాథావిథిగా నడపనున్నట్లు వెల్లడించింది.

ఫెంగల్ తుఫాన్ వల్ల భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించిన వాతావరణ శాఖ.. రెడ్ అలర్ట్ జారీ చేసింది. చెన్నై నగరంలోని స్కూళ్లు, కాలేజీలకు ఇప్పటికే సెలవు ప్రకటించింది. మరోవైపు.. సాఫ్ట్‌వేర్ సంస్థలు, ప్రైవేటు ఉద్యోగులు కూడా ఇంటి నుంచే పనిచేసుకోవాలని సూచించింది. ఇక చెన్నై నుంచి రాకపోకలు సాగించే విమానాలను పక్కనే ఉన్న బెంగళూరు సహా ఇతర ఎయిర్‌పోర్టులకు మళ్లిస్తున్నారు. ఇక తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలో, ఫెంగల్ తుఫాను తీరం దాటే క్రమంలో సమీప ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు కల్పక్కం సమీపంలోని సహాయ శిబిరాలకు తరలివచ్చారు.

మరోవైపు ఫెంగల్ తుఫాన్ వల్ల తెలుగురాష్ట్రాల్లోనూ వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల ఇప్పటికే వర్షాలు పడుతున్నాయి. ఇక తూర్పు తమిళనాడు-పుదుచ్చేరి తీరం వద్ద గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ఫెంగల్ తుఫాను తీరం దాటనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కేరళ, కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ ఆదివారం నాడు ఎల్లో అలర్ట్‌లో ఉన్నాయి. ఎందుకంటే తుఫాను తుఫాను తదుపరి తీరాన్ని తాకనుంది.

Read Also: Spa Center : స్పా సెంటర్‌లో క్రాస్ మసాజింగ్.. పెద్దసంఖ్యలో కండోమ్స్, గంజాయి

 

  Last Updated: 30 Nov 2024, 06:40 PM IST