Bridge Collapse: అమెరికా(America)లో ఓ నదిపై నిర్మించిన బ్రిడ్జి కుప్పకూలింది. నదిలో నుంచి వెళ్లిన పడవ ఆ బ్రిడ్జిని ఢీకొట్టడంతో కాసేపటికే కుప్పకూలింది(Bridge Collapse). నది కుప్పకూలిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమెరికాలోని బాల్టిమోర్‌లో ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జ్(Francis Scott Key Bridge in Baltimore) ఉంది. పటాపస్కో నదిపై(Patapasco River) ఈ బ్రిడ్జిని నిర్మించారు. మంగళవారం తెల్లవారుజామున ఈ బ్రిడ్జిని ఒక భారీ కంటైనర్ బోటు ఢీకొట్టింది. దాంతో.. నిలబడలేకపోయిన బ్రిడ్జి ఒక్కసారిగా కూప్పకూలిపోయింది. సింగపూర్ జెండాతో ఆ నౌక ప్రయాణిస్తున్నట్లు అక్కడున్న కొందరు వెల్లడించారు. బాల్టిమోర్ నుంచి ఆ నౌక శ్రీలంక లోని కొలంబోకు వెళ్తున్నట్లు అధికారులు చెప్పారు. ఈ నౌకకు దాలి అనే పేరు ఉన్నట్లు తెలిసింది.
అమెరికా బాల్టిమోర్‌లోని ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జిని ఓడ ఢీకొట్టడంతో కుప్పకూలిపోయిన బ్రిడ్జి. #bridgecollapse #baltimorebridge #USA #BreakingNews #HashtagU pic.twitter.com/5jv5bacGiM
— Hashtag U (@HashtaguIn) March 26, 2024
We’re now on WhatsApp. Click to Join.
బ్రిడ్జిని నౌక ఢీకొట్టిన తర్వాత అది స్థిరత్వాన్ని కోల్పోయినట్లు అధికారులు గుర్తించారు. దాంతో ముందు జాగ్రత్తగా ఆ బ్రిడ్జిపై నుంచి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. బ్రిడ్జికి చెందిన అన్ని లేన్లను మూసివేసినట్లు మేరిల్యాండ్ ట్రాన్స్‌పోర్టేషన్ అధికారులు చెప్పారు. ట్రాఫిక్‌ను మరోవైపు మళ్లించారు. అయితే.. ఏడు మందితో పాటు ఏడు వాహనాలు బ్రిడ్జి కూలిన సమయంలో నదిలో పడినట్లు ఫైర్ శాఖ అధికారులు చెప్పారు. బ్రిడ్జి కూలిపోతుండగా వీడియోలు రికార్డు చేశారు. ప్రస్తుతం అవే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే.. మృతుల సంఖ్య ఇప్పటి వరకు ఇంకా తెలియలేదు అనీ.. గాలింపు తర్వాత చెబుతామని స్థానిక అధికారులు చెప్పారు.
Read Also:Varun Gandhi : వరుణ్ గాంధీకి కాంగ్రెస్ ఆఫర్.. పార్టీలో చేరే ఛాన్స్ ?