Ayodhya Ram Mandir : అయోధ్య రామమందిరం నిర్మాణ విశేషాలు ఇవిగో

Ayodhya Ram Mandir : జనవరి 22న ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిరం ప్రారంభం కాబోతోంది.

Published By: HashtagU Telugu Desk
Ayodhya Ram Mandir

Ayodhya Ram Mandir

Ayodhya Ram Mandir : జనవరి 22న ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిరం ప్రారంభం కాబోతోంది. ఆ రోజున భవ్య రామమందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈసందర్భంగా ఆలయానికి సంబంధించిన పలు ప్రత్యేకతలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ వెల్లడించింది. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం.

We’re now on WhatsApp. Click to Join.

  • అయోధ్య రామమందిరం గర్భగుడిలో 51 అంగుళాల బాల రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు.
  • ఉత్తర భారతదేశంలోని మూడు హిందూ వాస్తు శైలుల్లో  ‘నగర’ అనే శైలి ఒకటి. ‘నగర’ శైలిలోనే అయోధ్య రామమందిరాన్ని నిర్మిస్తున్నారు.
  • రామమందిరం చుట్టూ దీర్ఘచతురస్ర ఆకారంలో 732 మీటర్ల పొడవుతో గోడ ఉంటుంది. దాని వెడల్పు 14 అడుగులు.
  • ఆలయానికి గోడలు నిర్మించడం అనేది దక్షిణ భారతదేశంలోని ద్రవిడ ఆలయ నిర్మాణ శైలిలో ప్రత్యేకం.
  • ఆలయాన్ని 3 అంతస్తుల్లో నిర్మిస్తున్నారు. ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తులో ఉంటుంది.
  • మొదటి అంతస్తులో శ్రీరామ దర్బార్‌తోపాటు ప్రధాన ఆలయం గర్భగుడి ఉంటాయి.

Also Read: Murder In School : స్కూల్‌లో విద్యార్థి కాల్పులు.. ఒకరి మృతి.. ఐదుగురికి గాయాలు

  • రామ మందిరం ప్రధాన ఆలయానికి ఉత్తరం వైపున అన్నపూర్ణ అమ్మవారి ఆలయం, దక్షిణం వైపున  హనుమంతుడి ఆలయం ఉంటాయి.
  • రామ మందిరం నాలుగు మూలల నాలుగు ఆలయాలను నిర్మిస్తున్నారు. వీటిలో సూర్య భగవానుడు, భగవతి, గణపతి, శివుడి ఆలయాలున్నాయి.
  • ఆలయం మొత్తం 161 అడుగుల ఎత్తుతో ఉంటుంది. రామమందిరాన్ని తూర్పు నుంచి పడమరకు 380 అడుగులు  పొడవు, 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తుతో నిర్మిస్తున్నారు.
  • రామమందిరానికి 392 స్తంభాలు, 44 గేట్లు ఉంటాయి.
  • ఆలయంలో నృత్య మండపం, రంగమండపం, సభా మండపం, ప్రార్థనా మండపం, కీర్తనా మండపం ఉంటాయి.
  • రామమందిరం సింహ ద్వారం నుంచి లోపలికి 32 మెట్లు ఉన్నాయి.
  • రామమందిరం సమీపంలోనే సీతాకూపం ఉంటుంది. అక్కడ వాల్మీకి , వశిష్ఠ, విశ్వామిత్ర, అగస్త్య మహర్షుల, నిశద్‌రాజ్‌, శబరి, దేవిఅహల్య ఆలయాలను నిర్మిస్తున్నారు.
  • ఆలయానికి నైరుతి వైపున ఉన్న నవరత్న కుబేర్‌ తిలపై ఉన్న పురాతన శివుడి ఆలయాన్ని పునరుద్ధరించారు. అక్కడే జటాయువు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు.
  • అయోధ్య రామమందిరం నిర్మాణం కోసం ఎక్కడ కూడా ఇనుమును ఉపయోగించడం లేదు.
  • ఆలయం కింద 14 మీటర్ల మందంతో రోలర్‌ కాంపాక్టు కాంక్రీట్‌ వేశారు.
  • భూమిలోని తేమ నుంచి ఆలయానికి రక్షణ కల్పించేందుకు గ్రానైట్‌తో 21 అడుగుల ఎత్తైన పునాదిని కట్టారు.
  • ఆలయానికి చెందిన  మొత్తం 70 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 70శాతం గ్రీనరీతో కనిపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

Also Read: DGPs Meet : ఒకే వేదికపైకి 450 మంది డీజీపీలు, ఐజీపీలు.. నేటి నుంచి కీలక భేటీ

  Last Updated: 05 Jan 2024, 08:30 AM IST