Man And Dog-A Missing : ఒక వ్యక్తి.. ఒక కుక్క.. నడి సముద్రంలో 3 నెలలు!

Man And Dog-A Missing :  తన కుక్కతో కలిసి సముద్రంలో బోటు జర్నీ చేసిన  ఒక నావికుడు తుఫాను దెబ్బకు  మిస్సయ్యాడు.. 

Published By: HashtagU Telugu Desk
Man And Dog A Missing

Man And Dog A Missing

Man And Dog-A Missing :  సముద్రంలో షిప్ తో సహా టూరిస్టులు తప్పిపోయిన స్టోరీస్ తో  మనం చాలా మూవీస్ ను చూశాము..

ఇలాంటి చాలా రియల్ ఘటనల గురించి న్యూస్ లోనూ విన్నాం..  

తాజాగా ఇలాంటిదే ఒక ఘటన చోటుచేసుకుంది. 

తన కుక్కతో కలిసి సముద్రంలో బోటు జర్నీ చేసిన  ఒక నావికుడు తుఫాను దెబ్బకు  మిస్సయ్యాడు.. 

ఎట్టకేలకు 3 నెలల తర్వాత అతడి ఆచూకీ దొరకడంతో.. మత్స్యకారులు రక్షించి తీరానికి తీసుకొచ్చారు.  

ఈ మూడు నెలల పాటు నడి సముద్రంలో ఆ వ్యక్తి, ఆ కుక్క ఎలా గడిపాయో ఇప్పుడు తెలుసుకుందాం..  

ఆస్ట్రేలియాలోని సిడ్నీ చెందిన 51 ఏళ్ళ నావికుడు టిమ్ షాడాక్ రియల్  స్టోరీ, లేటెస్ట్ స్టోరీ  ఇది. అతడు తన కుక్క బెల్లాతో  ఏప్రిల్‌ నెలలో మెక్సికో నుంచి  ఫ్రెంచ్ పాలినేషియాకు బోటులో బయలుదేరాడు. కొన్ని వారాల జర్నీ తర్వాత.. మార్గం మధ్యలో సముద్ర  తుఫాను కారణంగా అతడి  బోటులోని ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ దెబ్బతిన్నాయి. దీంతో  దాదాపు గత 3 నెలలుగా టిమ్ షాడాక్  తన కుక్కతో కలిసి  పసిఫిక్ మహాసముద్రం మధ్యలోనే(Man And Dog-A Missing) గడిపాడు. నడి సముద్రంలో ఉన్న ఈ మూడు నెలల టైంలో  పచ్చి చేపలను పట్టుకొని తింటూ, వాన నీటిని పట్టుకొని తాగుతూ బతికామని టిమ్ షాడాక్  చెప్పాడు.

Also read : TSRTC: శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్, ప్రతి వీకెండ్‌కు ప్రత్యేక బస్సులు

ఆ సముద్ర మార్గం మీదుగా వెళ్తున్న ఓ హెలికాప్టర్ నుంచి టూరిస్టులు టిమ్ షాడాక్  బోటును చూశారు. అనంతరం వాళ్ళు ఈవిషయాన్ని తీరంలో ఉన్న మత్స్యకారులకు చెప్పారు. వెంటనే మత్స్యకారులు బోట్లలో వచ్చి  టిమ్ షాడాక్  ను తమ బోట్లలోకి ఎక్కించుకొని సముద్ర  తీరానికి తీసుకెళ్లారు. దూరం నుంచి తనను రక్షించడానికి బోట్లు వస్తుండటాన్ని చూసి.. ప్రాణాలు మళ్ళీ  లేచి వచ్చాయని, జీవితంపై ఆశ ఇంకోసారి   పుట్టిందని  అతడు చెప్పాడు. తనను, తన కుక్కను రక్షించిన మత్స్యకారులకు కృతజ్ఞతలు తెలిపాడు. 3 నెలల తర్వాత నడి సముద్రం నుంచి భూమిపైకి అడుగుపెట్టే టైంలో..  టిమ్ షాడాక్ పెరిగిన గడ్డం, మాసిన దుస్తులతో ఆగమాగమై ఉన్నాడు.

Also read : Bogatha Waterfall: బొగత జలపాతం ఉగ్రరూపం, టూరిస్టులకు నో ఎంట్రీ

  Last Updated: 19 Jul 2023, 01:23 PM IST