Site icon HashtagU Telugu

Today Horoscope : ఆగస్టు 9 బుధవారం రాశి ఫలితాలు.. ఆ రాశి వారికి బ్యాడ్ టైం

Today Horoscope

Today Horoscope

Today Horoscope : మేష రాశి నుంచి మీన రాశి వరకు ఈరోజు రాశి ఫలితాలు ఇవీ..  

మేష రాశి

ఈరోజు మేషరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు లాభదాయకం.  కుటుంబ విషయాలలో జాగ్రత్త అవసరం. గొడవలకు దూరంగా ఉండాలి. మనసు చెడు పనుల మీదకు మళ్లుతుంది. అనవసర ధన వ్యయం జరిగే సూచనలు ఉన్నాయి.  వినాయకుడిని, హనుమంతుడిని ఆరాధించాలి.

వృషభ రాశి

ఈరోజు వృషభ రాశిలోని వ్యాపారస్తులకు ఖర్చులతో కూడిన సమయం. రైతాంగం, సినీరంగం వారికి ప్రతికూల ఫలితాలు ఉన్నాయి. ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగును. ఖర్చులు నియంత్రించుకోవాలి. ప్రారంభించబోయే పనుల్లో మంచి ఫలితాలు రాబడతారు.  ఈరోజు శ్రీకృష్ణున్ని, ఆంజనేయుడిని ఆరాధిస్తే మంచిది.

మిథునం

ఈరోజు మిథునరాశి వారి పనులలో ఆటంకాలు ఏర్పడుతాయి.  ఉద్యోగంలో పని ఒత్తిళ్ళు, వ్యాపారంలో ధనపరమైన చికాకులు ఏర్పడును. కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. కుటుంబములో వాద ప్రతివాదనలు చోటు చేసుకునే ప్రమాదం ఉంది. వివాదాలకు దూరంగా ఉండాలి. మహావిష్ణువును, ఆంజనేయుడిని ఆరాధిస్తే మంచిది.

కర్కాటకం

ఈరోజు కర్కాటక రాశి వారు ఖర్చులు తగ్గించుకోవాలి.  కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వస్తాయి. కొన్నాళ్లుగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఉద్యోగస్తులకు సత్ఫలితాలు కలుగును. వెంకటేశ్వరస్వామిని, గణపతిని ఆరాధన చేయడం మంచిది.

సింహం

ఈరోజు సింహరాశి వారికి కొన్ని వ్యవహారాలలో ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. శారీరక శ్రమ అధికం అవుతుంది. వాగ్వాదానికి దూరంగా ఉండటమే మంచిది. ఉద్యోగస్తులకు మధ్యస్థ సమయం. సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం, శని శ్లోకాన్ని చదవడం మంచిది.

Also read : Asatoma Sadgamaya : మీ జీవితాన్ని మార్చేసే గొప్ప మంత్రం

కన్య(Today Horoscope)

ఈరోజు కన్యారాశి వారు కుటుంబ, ఆరోగ్య విషయాలలో ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపారస్తులకు ఖర్చులు పెరుగుతాయి.  అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. శత్రువుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. అనవసరంగా ఆందోళన పడతారు. భగవద్గీత వినడం, చదవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

తుల

ఈరోజు తులారాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కలసివచ్చును. సినీరంగం, రైతాంగం వారికి కలసివచ్చును. కీలక వ్యవహారంలో పెద్దలు  మీకు అనుకూల నిర్ణయం తీసుకుంటారు. కోపతాపాలకు  పోకండి. మనసు చెడు పనులమీదకు మళ్లుతుంది.  మహావిష్ణువును పూజించాలి. శివాష్టోత్తరం చదవాలి.

వృశ్చికం

ఈరోజు వృశ్చిక రాశివారు ప్రతీ విషయాన్ని అతిగా ఆలోచించకూడదు. ఒక ముఖ్య విషయమై అధికారులను కలుస్తారు. ఫలితం సానుకూలంగా వస్తుంది.  ఉద్యోగస్తులకు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. మానసికంగా ఆనందంగా గడుపుతారు. వేంకటేశ్వరస్వామిని పూజించాలి.

ధనుస్సు

ఈరోజు ధనుస్సు రాశి వారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. కుటుంబ విషయాల్లో కలహాలు ఏర్పడే సూచన ఉంది. వాగ్వాదాలకు దూరంగా ఉండాలి.  ఆలోచించి చేసే ప్రతీ పనిలో విజయం  సాధిస్తారు. ప్రారంభించిన పనిలో తోటివారి సహకారం లభిస్తుంది. శ్రీరామనామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది.

Also read : Nehru Independence Day Speech : మొట్టమొదటి ఆగస్టు 15 వేడుకల్లో చాచా నెహ్రూ ప్రసంగం ఇదిగో

మకరం

ఈరోజు మకర రాశి వారు కుటుంబ, రాజకీయ విషయాల్లో అతిగా ప్రవర్తించరాదు. ప్రతి విషయాన్ని అతిగా ఆలోచించరాదు. ఉద్యోగస్తులకు ఒత్తిళ్ళు పెరుగుతాయి. వ్యాపారస్తులకు, రైతాంగం, సినీరంగం వారికి మధ్యస్థం నుంచి  చెడు ఫలితాలు ఉన్నాయి. శ్రీకృష్ణున్ని పూజించాలి.

కుంభం

ఈరోజు కుంభ రాశి వారికి ప్రతి పనిలో చికాకులు, ఆటంకములు ఏర్పడుతాయి. కుటుంబ సమస్యలు ఇబ్బంది పెట్టును. నిరుద్యోగులకు కష్ట సమయం. ఉద్యోగస్తులకు ఒత్తిళ్లు పెరుగుతాయి. అప్పులు చేసి వ్యాపారాన్ని నిర్వహించే స్థితి వస్తుంది. రైతాంగం, సినీరంగం వారికీ అనుకూలంగా లేదు. విద్యార్థులకూ ప్రతికూల సమయం. మహావిష్ణువు యొక్క అష్టోత్తర శతనామావళి పఠించండి. హనుమాన్ చాలీసా చదవాలి.

మీనం 

ఈరోజు మీన రాశి వారికి మానసిక ఆందోళన కలుగుతుంది.  అప్పులివ్వడం, అప్పులు చేయడం వల్ల ఇబ్బందులు పడతారు.  వ్యాపారంలో అనుకోని ఖర్చులు వస్తాయి. ఉద్యోగస్తులకు రాజకీయ ఒత్తిళ్ళు పెరుగుతాయి. రైతాంగం, సినీరంగం వారికి అనుకూలంగా లేదు. కీలక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి.  శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం చదవడం వినడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. హనుమాన్ చాలీసా చదవాలి.

గమనిక:  ఈ కథనంలో ఉన్న సమాచారం జ్యోతిష్యులు/ పంచాంగాలు/ ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.