Site icon HashtagU Telugu

Today Horoscope : ఆగస్టు 19 శనివారం రాశి ఫలితాలు.. వారికి కోర్టు కేసుల్లో విజయం

Today Horoscope

Today Horoscope

Today Horoscope : మేష రాశి నుంచి మీన రాశి వరకు ఈరోజు రాశి ఫలితాలు ఇవీ..  

మేష రాశి

ఈరోజు మేషరాశి వారు ఇతరుల తప్పులను ఎగతాళి చేయొద్దు. కుటుంబ సభ్యుల వల్ల ఇబ్బందులకు గురవుతారు. వైవాహిక జీవితంలో ఉండే ఇబ్బందులు దూరమైపోతాయి. నూతన పథకాల్లో పెట్టుబడులు పెట్టడం ఇప్పుడంత శ్రేయస్కరం కాదు. విశ్రాంతి అవసరం. విద్యార్థులు చదువుతో పాటూ వేరే ఉద్యోగం చేయాలనే ఆలోచనతో ఉంటారు. శుభ వార్తలు వింటారు. విదేశీయాన అవకాశం ఉంది. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి.

వృషభ రాశి

ఈరోజు వృషభ రాశి వారు నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపడకండి. మీరు తీసుకునే తప్పుడు నిర్ణయాల వల్ల కుటుంబం ఒత్తిళ్ళకు గురవుతుంది. ఆచితూచి వ్యవహరించండి. కుటుంబములో సమస్యల వల్ల మీరు నిరాశకు గురవుతారు. మీకు సహాయం చేయడానికి సన్నిహితులు ముందుకు వస్తారు. పిల్లల కార్యకలాపాలపై నిఘా ఉంచండి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటాయి జాగ్రత్త. ప్రేమ వ్యవహారాల విషయంలో కాస్త సున్నితంగా ఉంటారు.  తప్పుడు ప్రాజెక్ట్‌ల వల్ల వ్యాపారంలో అడ్డంకులు ఏర్పడవచ్చు. నవగ్రహ ఆలయ ప్రదక్షిణం చేయడం మంచిది. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

మిథునం

ఈరోజు మిథునరాశి వారు విలువైన వస్తువులను కోల్పోయే అవకాశముంది. తెలియని వ్యక్తులను ఎక్కువగా నమ్మవద్దు. మీ అభిప్రాయాలను మళ్లీ మళ్లీ మార్చుకోవద్దు. చెడు వ్యసనాలకు లోను కావద్దు. మానసిక ఒత్తిళ్ళ వల్ల శారీరక సమస్యలు కలుగును. కుటుంబంలో మీ గౌరవం తగ్గవచ్చు. ఆగిపోయిన పనులు పూర్తిచేయగలుగుతారు. ఆస్తులపై పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించండి. ఉద్యోగులకు ఇతరులతో ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి.

Also read : Shravan Masam: శ్రావణ శుక్రవారం పూజ ఎందుకు చేయాలి..?

కర్కాటకం

ఈరోజు కర్కాటక రాశి వారు అనవసర విషయాలకు దూరంగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలకు ఆశించిన ఫలితాలు పొందలేరు. కుటుంబం, బంధువుల నుంచి ఒత్తిళ్ళు అధికం. కోర్టు కేసుల వ్యవహారాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. విద్యార్థులు కష్టపడవలసిన సమయం. మీ సహ ఉద్యోగుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ ఆలయాలలో శనికి తైలాభిషేకం చేయించి నవగ్రహలకు ప్రదక్షిణం చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

సింహం

ఈరోజు సింహరాశి వారు కుటుంబంలో కొన్ని వివాద పరిస్థితులను ఎదుర్కోవలసి రావచ్చు. మీ మాటతీరు ఇతరులను ఇబ్బందులకు గురిచేస్తుంది.  కుటుంబ పనులలో మీ పిల్లలు మీకు సహాయపడతారు. నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. రాజకీయ నాయకులకు అనుకూలం. ఉద్యోగులు పనితీరు మార్చుకోవాల్సి ఉంటుంది.  బాలికలకు అనుకూలం. వేంకటేశ్వరస్వామిని పూజించడం వేంకటేశ్వరస్వామి సుప్రభాతం వినడం, చదవడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.

కన్య (Today Horoscope)

ఈరోజు కన్యారాశి వారి ఆదాయం బాగానే ఉంటుంది. ఖర్చులు కూడా పెరుగుతాయి. అప్పులివ్వరాదు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మీ తప్పులను మీరు తెలుసుకుంటారు. క్లిష్ట పరిస్థితులు ఏకాగ్రతను ప్రభావితం చేస్తాయి. మానసిక ఒత్తిళ్ళకు లోనయ్యే అవకాశం ఉంది. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

Also read: Richest MP – Rajya Sabha : దేశంలోనే ధనిక ఎంపీ బండి పార్థసారథి.. సెకండ్ ప్లేస్ లో ఆళ్ల అయోధ్య రామిరెడ్డి

తుల

ఈరోజు తులారాశి వారికి అంత అనుకూలంగా లేదు. మీ మొండి పట్టుదల వివాదాలకు కారణమవుతుంది. మీ ప్రవర్తనా విధానం మీ పనిపై ప్రభావం చూపిస్తుంది. మీరు చేసే పనుల కారణంగా ఒత్తిళ్ళకు గురి అవుతారు. కుటుంబ సభ్యులతో ఇబ్బందులు ఉన్నాయి.టైమ్ వేస్ట్ చేసే కార్యక్రమాలు చేయకపోవడమే మంచిది. ఈరోజు కొత్తగా ప్రణాళికలు అమలుచేసేందుకు మంచి రోజు కాదు. వాహనాలు వేగంగా నడపడం అంత మంచిది కాదు.  నిర్మాణ రంగంలో ఉండేవారికి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది.  విదేశీ ప్రయత్నాలకు ఆటంకము కలుగును. శివాలయాన్ని దర్శించండి.

వృశ్చికం

ఈరోజు వృశ్చిక రాశిలోని విద్యార్థులు కష్టపడవలసిన సమయం. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించండి. ఆహారపు అలవాట్లు మీకు ఇబ్బందులు సృష్టిస్తాయి. జీర్ణ సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. స్నేహితులతో కలిసి బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. సంతానం పట్ల ఆందోళనలు తొలగుతాయి. నవగ్రహ ఆలయాలలో శనికి తైలాభిషేకం చేయించి నవగ్రహాలకు ప్రదక్షిణం చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

ధనుస్సు

ఈరోజు ధనుస్సు రాశి వారు ప్రయాణాలకు దూరంగా ఉండండి. మీరు కష్టపడి సంపాదించుకున్న ధనాన్ని ఆచితూచి ఖర్చుపెట్టండి. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోవద్దు. శారీరక శ్రమ కలుగును. ఉద్యోగం మారాలి అనుకుంటే ఇదే మంచి సమయం. ఉద్యోగులకు కార్యాలయంలో ఉండే వివాదాలు తొలగిపోతాయి. ఆదాయం పెరుగుతుంది. వేంకటేశ్వరస్వామిని పూజించడం, వేంకటేశ్వరస్వామి సుప్రభాతం వినడం చదవడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

మకరం

ఈరోజు మకర రాశి వారు అనవసర ఖర్చులు నియంత్రించుకోవాలి. పని ఒత్తిళ్ళకు లోనవుతారు. ముఖ్యమైన పనులకు ఆటంకం కలుగును. ఇతరులతో భేదాభిప్రాయములు కలుగును. ఉద్యోగులు  కార్యాలయ రాజకీయాలకు దూరంగా ఉండాలి. ఉన్నత విద్యలో అడ్డంకులు ఎదుర్కోవాల్సి రావొచ్చు.మీ జీవితానికి సంబంధించిన నిర్ణయాలను త్వరంగా తీసుకుంటారు. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

Also read: Oily Skin Tips: ముఖం పదే పదే జిడ్డుగా అవుతోందా.. అయితే ఈ చిట్కాలు పాటించండి?

కుంభం

ఈరోజు కుంభ రాశి వారి కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులుంటాయి. మూర్ఖత్వంతో వ్యవహరించ రాదు. మీ కుటుంబ సభ్యుల సహాయంతో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఖర్చులను నియంత్రించుకోవాలి.  శనివారం రోజు వికలాంగులకు అన్నదానం చేయండి. ఉద్యోగులు అతి విశ్వాసానికి దూరంగా ఉండాలి.  శివాలయాన్ని దర్శించండి.

మీనం 

ఈరోజు మీన రాశి వారు ఆర్ధిక లాభం పొందుతారు. ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు కలిసొస్తాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆన్‌లైన్ వ్యాపారంలో పెద్ద మొత్తంలో లాభం పొందవచ్చు. వ్యాపారంలో వచ్చే కొన్ని ఇబ్బందులను తొలగించుకోగలుగుతారు. విద్యార్థులు కష్టపడవలసిన సమయం.  మానసిక ఒత్తిళ్ళు తగ్గించుకోవాలని సూచన. నవగ్రహ ఆలయాలలో శనికి తైలాభిషేకం చేయించి నవగ్రహాలకు ప్రదక్షిణం చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

గమనిక:  ఈ కథనంలో ఉన్న సమాచారం జ్యోతిష్యులు/ పంచాంగాలు/ ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.