Site icon HashtagU Telugu

Today Horoscope : ఆగస్టు 11 శుక్రవారం రాశి ఫలితాలు.. వారిపై ఒత్తిళ్లు అధికం

Today Horoscope

Today Horoscope

Today Horoscope : మేష రాశి నుంచి మీన రాశి వరకు ఈరోజు రాశి ఫలితాలు ఇవీ..  

మేష రాశి

ఈరోజు మేషరాశిలోని వ్యాపారస్తులకు ఆశించిన స్థాయిలో వ్యాపారం జరగదు. రైతాంగం, సినీరంగం వారికి అంత అనుకూలంగా లేదు. పనిలో ఒత్తిడి పెరుగుతుంది. బంధు, మిత్రులతో అతిచనువు వద్దు. ఉద్యోగస్తులకు అనుకూలం. మహాలక్ష్మి అష్టకాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

వృషభ రాశి

ఈరోజు వృషభ రాశి వారికి అనుకూలం. విద్యార్థులకు కలసివచ్చే రోజు. బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరించి అందరి దృష్టినీ ఆకర్షిస్తారు. ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు సవ్యంగా సాగుతాయి. లక్ష్మీస్తోత్రం పఠించండి.

మిథునం

ఈరోజు మిథునరాశిలోని ఉద్యోగస్తులకు ఒత్తిళ్ళు అధికము. అధికారులు మీకు అనుకూలమైన ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. వ్యాపారస్తులు ఖర్చులు నియంత్రించుకోవాలి. కుటుంబములో వాదనలు ఏర్పడు స్థితి. కొన్ని కీలక పనులను పూర్తిచేయగలుగుతారు. పంచదార వెన్న కలిపి బాలకృష్ణునికి నివేదించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

కర్కాటకం

ఈరోజు కర్కాటక రాశి వారికి అంత అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు రాజకీయ ఒత్తిళ్ళు అధికము. రైతాంగం, సినీరంగం వారికి అనుకూలంగా లేదు. ఇతరులతో గొడవలకు వెళ్ళరాదు. కుటుంబ, ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు వహించాలి. గతంలో ఆగిన పనులు మళ్లీ ప్రారంభం అవుతాయి.  విష్ణు సహస్రనామం పఠించండి.

సింహం

ఈరోజు సింహరాశి వారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి. చేసే పనులు లాభదాయకముగా ఉంటాయి. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. ఉద్యోస్తులకు ఒత్తిళ్ళు ఉన్నప్పటికి మంచి ఫలితాలు పొందుతారు. విద్యార్థులకు అనుకూలం. కృష్ణాష్టకం చదివితే బాగుంటుంది.

Also read : Telangana GDP Jump : తలసరి నికర ఆదాయంలో నంబర్ 1 తెలంగాణ : కేంద్రం

కన్య(Today Horoscope)

ఈరోజు కన్యారాశి వారు చేసే పనులలో శ్రమ అధికము. ఆటంకాలు ఎదురవుతాయి. ఖర్చులు నియంత్రించుకోవాలి. రైతాంగం, సినీరంగం వారికి అనుకూలంగా లేదు. ముఖ్య వ్యవహారంలో పెద్దలను కలుస్తారు. నిర్ణయం మీకు అనుకూలంగా రాకపోవచ్చు.  లక్ష్మీదేవిని పూజించండి.

తుల

ఈరోజు తులారాశి వారి కుటుంబములో వాద ప్రతివాదనలు ఏర్పడును. మానసిక ప్రశాంతత ఉండదు. విద్యార్థులకు అంత అనుకూలంగా లేదు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. మీ ప్రతిభకు పెద్దలు లేదా అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. పంచదార వెన్న కలిపి బాలకృష్ణునికి నివేదించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

వృశ్చికం

ఈరోజు వృశ్చిక రాశివారికి అనుకూలం. ఉద్యోగస్తులకు శ్రమకు తగ్గ ఫలితం లభించును. వ్యాపారస్తులకు లాభదాయకము. అభివృద్ధికి సంబంధించిన వార్త ఒకటి వింటారు. కీలక బాధ్యతలు మీ భుజాన పడతాయి. మీరు గతంలో జీవించరాదు. ముందుకు సాగిపోవడం ప్రశాంతతనిస్తుంది.  శివారాధన శుభప్రదం.

Also read : 1700 Buildings Destroyed : ఆ టౌన్ 80 శాతం కాలి బూడిదైంది.. వేలాది మంది నిరాశ్రయులయ్యారు

ధనుస్సు

ఈరోజు ధనుస్సు రాశి వారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి. మీరు చేసే ప్రతీ పని కలసివచ్చును. కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో కలహాలు ఏర్పడు స్థితి. వాగ్వివాదాలకు దూరంగా ఉ౦డాలి. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి.  ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. పంచముఖ ఆంజనేయుడిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.

మకరం

ఈరోజు మకర రాశి వారికి అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులపై రాజకీయ ఒత్తిళ్ళు ఏర్పడును. రైతాంగం, సినీరంగం వారికి మధ్యస్థం నుండి చెడు ఫలితాలున్నాయి. అనవసర వస్తువులకోసం ధనమును ఖర్చు చేయరాదు. కుటుంబ విషయాల్లో ఓర్పు అవసరం. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ఒక విషయంలో ధైర్యంతో ముందడుగు వేసి కీర్తిని గడిస్తారు. ఈరోజు లక్ష్మీదేవిని పూజించండి.

కుంభం

ఈరోజు కుంభ రాశి వారికి  అనుకూలం. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు అనుకూలం. అలసట కాస్త ఎక్కువగా ఉంటుంది. ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఖర్చులు నియంత్రించుకోవాలి.  శ్రీవేంకటేశ్వరుడిని ఆరాధించడం వల్ల శుభ ఫలితాలను పొందగలుగుతారు.

Also read :Air India Logo: ఎయిర్ ఇండియా కొత్త లోగో విడుదల..!

మీనం 

ఈరోజు మీన రాశి వారికి అనుకూలం. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు. రైతాంగం మరియు సినీరంగం వారికి కలసివచ్చు రోజు.  మీరు చేసే పనులు సత్ఫాలితాలు ఇస్తాయి. అనవసర విషయాలకు ధనాన్ని అధికముగా ఖర్చు చేయవద్దని సూచన. విష్ణు సహస్రనామం పఠించండి.

గమనిక:  ఈ కథనంలో ఉన్న సమాచారం జ్యోతిష్యులు/ పంచాంగాలు/ ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.