Site icon HashtagU Telugu

Today Horoscope : ఆగస్టు 10 గురువారం రాశి ఫలితాలు.. ఆ రాశి వారికి అదృష్ట కాలం

Today Horoscope

Today Horoscope

Today Horoscope : మేష రాశి నుంచి మీన రాశి వరకు ఈరోజు రాశి ఫలితాలు ఇవీ..  

మేష రాశి

ఈరోజు మేషరాశి వారు ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబములో ఇబ్బందులు కలుగును. తరచూ నిర్ణయాలు మార్చడం ద్వారా ఇబ్బందులు ఎదురవుతాయి. శారీరక శ్రమ కలుగును. శ్రీఆంజనేయ ఆరాధన శుభప్రదం. దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించాలి.

వృషభ రాశి

ఈరోజు వృషభ రాశి వారికి ఈఅనుకూలం. ఉత్సాహంగా ఉంటారు. మీరంటే గిట్టని వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు.  ముందుచూపుతో వ్యవహరించాలి. కలహాలకు తావివ్వకండి. శ్రీవేంకటేశ్వరస్వామి సందర్శనం మేలు చేస్తుంది.దత్తాత్రేయుని పూజించాలి.

మిథునం

ఈరోజు మిథునరాశిలోని ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పని ఒత్తిళ్లు అధికము. వ్యాపారస్తులు ఖర్చులను నియంత్రించుకోవాలి. కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. కలహాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్య నియమాలను పాటించాలి. బ్రాహ్మణులకు గానీ ముత్తయిదువలకు గానీ తాంబూలం, శనగలను దానమివ్వడం మంచిది. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన శుభకరం.

కర్కాటకం

ఈరోజు కర్కాటక రాశిలోని ఉద్యోగ, వ్యాపారస్తులకు అనుకూలం. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. చేపట్టే పనిలో ఆటంకాలు అధికం అవుతాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి.దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించాలి. కనకధారాస్తవం చదవాలి.

సింహం

ఈరోజు సింహరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఒత్తిళ్లు అధికము. ఉద్యోగస్తులకు రాజకీయ ఒత్తిళ్ళు అధికం. అందరినీ కలుపుకొనిపోవడం అవసరం. వ్యాపారస్తులకు రావలసిన ధనం సకాలంలో అందదు. మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. దత్తాత్రేయుని పూజించాలి.

Also read : Rescheduled: ప్రపంచ కప్ కొత్త షెడ్యూల్ విడుదల.. భారత్-పాకిస్తాన్‌తో సహా 8 మ్యాచ్‌ల షెడ్యూల్‌ మార్పు..!

కన్య(Today Horoscope)

ఈరోజు కన్యారాశి వారికి అనుకూలం. ప్రణాళికాబద్ధంగా చేసే పనులు సత్ఫాలితాలు ఇస్తాయి. భోగభాగ్యాలు కలుగును. వృత్తి ఉద్యోగాలలో లాభదాయకము. మరింత శుభఫలితాల కోసం శనగలు దానమివ్వాలి. శనగలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి అది ప్రసాదంగా పంచిపెట్టాలి. అపోహలతో కాలాన్ని వృథా చేయకండి. ఖర్చులు తగ్గించుకోవాలి.

తుల

ఈరోజు తులారాశి వారు  కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. భార్యాభర్తల మధ్య కలహ సూచన. ఒక వార్త మనస్తాపానికి గురిచేస్తుంది. వృత్తి, ఉద్యోగపరంగా అనుకూలం. వ్యాపారస్తులకు లాభదాయకము. శివారాధన చేయాలి.

వృశ్చికం

ఈరోజు వృశ్చిక రాశివారికి అనుకూలం. ఉద్యోగస్తులకు శ్రమకు తగిన ఫలితం లభించును. వ్యాపారస్తులకు లాభదాయకం. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.మరింత శుభ ఫలితాల కోసం దత్తాత్రేయుని పూజించాలి. ఆత్మీయులతో వాగ్వాదాలకు పోవద్దు. భయాందోళనలను విడనాడాలి. చెడ్డవాళ్లతో సావాసం చేయడం వల్ల కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. దుర్గాస్తుతి చదవాలి.

ధనుస్సు

ఈరోజు ధనుస్సు రాశి వారికి కుటుంబ విషయాల్లో కలహాలు కలిగే సూచనలు ఉన్నాయి. ఆత్మీయులతో వాగ్వాదాలకు దూరంగా ఉండాలి. భయాందోళనలను విడనాడాలి. చెడ్డవాళ్లతో సావాసం చేయడం వల్ల కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. బృహస్పతి అనుగ్రహం కోసం శనగలు దానమివ్వాలి.

Also read : Ultra Rich Buying: దేశంలోని ధనవంతులు ఏ వస్తువులను ఎక్కువగా కొనుగోలు చేస్తారో తెలుసా..?

మకరం

ఈరోజు మకర రాశి వారికి కలిసివచ్చే రోజు. చేసే పనులు సత్ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగస్తులకు అనుకూలం. రాజకీయ ఒత్తిళ్లు ఉన్నప్పటికి మీ పనులలో విజయం పొందెదరు. స్త్రీలు కుటుంబ, ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు వహించాలి. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఖర్చులు అదుపు తప్పకుండా చూసుకోవాలి. మాటపట్టింపులకు పోరాదు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించాలి.

కుంభం

ఈరోజు కుంభ రాశి వారికి అనుకూలం. నూతన వస్తువులు, ఆభరణాల కోసం ధనాన్ని ఖర్చు చేస్తారు. ఖర్చులు నియంత్రించుకోవాలి. అనవసర ప్రయాణాల వల్ల సమయం వృథా అవుతుంది. బంధు,మిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. కలహాలకు తావివ్వరాదు. సుబ్రహ్మణ్య ఆరాధన మేలు చేస్తుంది. దత్తాత్రేయుని పూజించాలి.

మీనం 

ఈరోజు మీన రాశి వారికి అదృష్ట  కాలం. మీరు చేసే పనులు సత్ఫలితాలిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారంలో ముందడుగు వేస్తారు. అనవసర విషయాలకు ధనాన్ని అధికంగా ఖర్చు చేసెదరు. రైతాంగం, సినీరంగం వారికి కలసివచ్చే రోజు. మరింత శుభఫలితాల కోసం శనగలు దానమివ్వాలి.

గమనిక:  ఈ కథనంలో ఉన్న సమాచారం జ్యోతిష్యులు/ పంచాంగాలు/ ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.