Supreme Court: సుప్రీంకోర్టుకు కొత్తగా ఇద్దరు జడ్జీలు(Judges) నియవితులైయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి దౌపది ముర్ము(President Daupadi Murmu) ఈ జడ్జీల నియామకానికి క్లియరెన్స్ ఇచ్చారు. జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్, జస్టిస్ ఆర్ మహాదేవన్‌లు .. సుప్రీంకోర్టు జడ్జీలుగా నియమితులయ్యారు. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్.. ఆ జడ్జీ నియామకం గురించి ప్రకటన చేశారు. ఈ కొత్త నియామకాలతో సుప్రీంకోర్టు జడ్జీల సామర్థ్యం 34కు చేరుకున్నది. ఈ ఇద్దరు జడ్జీలకు పదోన్నతులు కల్పించాలని ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం ప్రతిపాదనలు చేసింది.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, జస్టిస్ ఎన్ కోటీశ్వర్‌సింగ్.. సుప్రీంకోర్టులో చేరిన మణిపూర్‌కు చెందిన తొలి జడ్జీగా రికార్డు క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఆయన జమ్మూకశ్మీర్, లడాఖ్ .. చీఫ్ జస్టిస్‌గా ఉన్నారు. మణిపూర్‌కు తొలి అడ్వకేట్ జనరల్‌గా చేసిన ఎన్ ఇబోటోంబి సింగ్ కుమారుడే జస్టిస్ కోటీశ్వర్ సింగ్. కిరోరి మాల్ కాలేజీ, ఢిల్లీ వర్సిటీ క్యాంపస్ లా సెంటర్‌లో ఆయన చదివారు. 1986లో అడ్వకేట్‌గా ఆయన కెరీర్‌ను ప్రారంభించారు. జడ్జిగా మారడానికి ముందు ఆయన మణిపూర్ అడ్వకేట్ జనరల్‌గా చేశారు. గౌహతి, మణిపూర్ హైకోర్టుల్లో చేశారాయన.
జస్టిస్ మహాదేవన్.. ప్రస్తుతం మద్రాసు హైకోర్టులో తాత్కాలిక చీఫ్ జస్టిస్‌గా చేస్తున్నారు. చెన్నైలో ఆయన జన్మించారు. మద్రాసు లా కాలేజీలో ఆయన చదివారు. లాయర్‌గా ఆయన సుమారు 9 వేల కేసులను వాదించారు. తమిళనాడు ప్రభుత్వానికి అదనపు ప్రభుత్వ ప్లీడర్‌గా చేశారు. 2013లో ఆయన మద్రాసు హైకోర్టు జడ్జీగా పదోన్నతి పొందారు.
Read Also: Effect of White Papers : చంద్రబాబు శ్వేతపత్రాల ఎఫెక్ట్ ..ఆ పార్టీ వైపు వైసీపీ నేతల ఫోకస్..?