Site icon HashtagU Telugu

Ap Eapcet Key : ఈఏపీసెట్‌ కీ రిలీజ్.. డౌన్ లోడ్ ఇలా

Ap Eapcet Key

Ap Eapcet Key

ఆంధ్రప్రదేశ్ లో ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల ప్రవేశాలకు సంబంధించిన ఈఏపీసెట్‌ ఎగ్జామ్స్ ప్రిలిమినరీ కీ (Ap Eapcet Key) రిలీజ్ అయింది. మంగళవారం రోజే ముగిసిన ఈ ఎగ్జామ్ కీ (Ap Eapcet Key)ని వెంటనే  ఇవాళ (బుధవారం) విడుదల చేశారు. అగ్రికల్చర్‌, ఫార్మసీ పరీక్షల కీ ఈరోజు ఉదయం 11 గంటల నుంచి అందుబాటులో ఉంటుంది. దీనిపై అభ్యంతరాలు ఉంటే.. ఈనెల 26న ఉదయం 9 గంటలలోపు తెలియజేయాలని ఈఏపీసెట్‌ ఛైర్మన్‌ రంగజనార్ధన, కన్వీనర్‌ శోభాబిందు కోరారు.
also read : Government Jobs for Engineers: నెలకు రూ.1.80 లక్షల జీతం.. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్‌కు గవర్నమెంట్ జాబ్స్
అభ్యంతరాల స్వీకరణ  విండో ఈ రోజు ఉదయం 9:00 నుంచి మే 26 , ఉదయం 9:00 గంటల వరకు తెరిచి ఉంటుందన్నారు. చెల్లుబాటు అయ్యే అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత, తుది సమాధాన కీ విడుదల చేస్తామన్నారు. ఈఏపీసెట్‌ వెబ్‌సైట్‌ https://cets.apsche.ap.gov.in/లో కీ  అందుబాటులో ఉంటుందని చెప్పారు. వెబ్‌సైట్ హోమ్‌పేజీలో “సమాధానం కీ” లేదా “డౌన్‌లోడ్ ఆన్సర్ కీ” విభాగాన్ని చూడొచ్చు.  దానిపై క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈఏపీసెట్‌ ద్వారా ప్రవేశాల కోసం ఇంజినీరింగ్‌ విభాగంలో 2,24,724 మంది, ఫార్మసీ, అగ్రికల్చర్‌ విభాగాల్లో 90,573 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.