AP Cabinet : సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పట్టణ ప్రాంతాల్లో వరద నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. రూ.617 కోట్లతో అసెంబ్లీ, రూ.786 కోట్లతో హైకోర్టు భవన నిర్మాణాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నిర్మాణ పనులను ఎల్1 బిడ్డర్‌కు అప్పగించాలని నిర్ణయించింది. స్టేట్ సెంటర్ ఫర్ క్లైమేట్ ఇన్ సిటీస్ వ్యవస్థల ఏర్పాటును ఆమోదించింది. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్‌కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
Read Also: Punjab Kings: పంజాబ్‌కు ఊహించని షాక్.. కీలక ఆటగాడు దూరం!
ఉరుస క్లస్టర్‌కు కాపులుప్పాడలో 56 ఎకరాల భూమిని కేటాయింపు బలిమెల, జోలాపుట్ రిజర్వాయర్ల వద్ద చేపట్టాల్సిన హైడల్ ప్రాజెక్టులకు సంబంధించిన నిర్మాణాలపై ఒడిశా పవర్ కన్సార్టియమ్‌కు కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 30 మెగావాట్ల సామర్థ్యంతో 2 హైడల్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం జలవనరుల శాఖ చేసిన ప్రతిపాదనలను కేబినెట్ ఆమోదం తెలిపింది. వివిధ ప్రాంతాల్లో పవన విద్యుత్, సౌర విద్యుత్ ప్లాట్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. విశాఖలోని ఐటీహిల్ -3 పైన టీసీఎస్‌కి 21.66 ఎకరాలు, ఉరుస క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కి 3.5 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
టీసీఎస్ ఏర్పాటు ద్వారా రూ.1370 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు రావటంతో పాటు 12 వేల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు విశాఖ ఐటీ హిల్‌లో 3.5 ఎకరాలు, కాపులుప్పాడలో 56 ఎకరాల కేటాయించేందుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, గుంటూరు , చిత్తూరు, కడప, అనంతపురం ఉమ్మడి జిల్లాలో సీనరేజీ ఫీజు వసూలు కాంట్రాక్టు గడువు పెంచే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విశాఖ ఐటీ హిల్స్‌లో టీసీఎస్‌కు 21.66 ఎకరాల భూమిని రూ. 99 పైసలకు లీజు ఇచ్చేందుకు కేబినేట్ సూత్రప్రాయంగా ఓకే అంది.
గుంటూరు జిల్లా పత్తిపాడు మండలంలో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటుకు 6.35 ఎకరాల భూమి కేటాయించనుంది. కుప్పంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వ భూ మార్పిడికి ఆమోదం తెలిపింది. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో పారిశ్రామిక పార్క్ ఏర్పాటుకు ఏపీఐఐసీకి భూ కేటాయింపులకు చంద్రబాబు కేబినెట్ అమోదం తెలిపింది. స్టేట్ సెంటర్ ఫర్ క్లైమేట్ ఇన్ సిటీస్ వ్యవస్థ ఏర్పాటుపై కేబినెట్ లో చర్చించారు.. 3 జిల్లాల్లో 199 వ్యవసాయ ఫీడర్ల ఏర్పాటుకు సంబంధించిన డీపీఆర్‌లకు ఆమోదం తెలిపింది. వివిధ ప్రాంతాల్లో సౌర, పవన, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ భవన నిర్మాణానికి రూ. 617 కోట్లు, హైకోర్టు నిర్మాణానికి రూ.786 కోట్లు, ఎల్ 1 బిడ్డర్‌లకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ అందజేసేందుకు ఏపీ సీఆర్డీఏ కమిషనర్‌కు అధికారాన్ని కట్టబెడుతూ కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. సీఆర్డీఏ 46వ ఆధారిటీలో అమోదించిన అంశాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతి నిర్మాణం కోసం అవసరమైన నిధులు సమీకరించుకునేందుకు సీఆర్డీఏ కమిషనర్‌కు కేబినెట్ అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే నూతన అసెంబ్లీ, హైకోర్టు భవనాల టెండర్లకు అంగీకారం తెలిపింది. టెండర్లలో ఎల్ 1గా నిలిచిన కంపెనీకి పనులు అప్పగించేందుకు నిర్ణయించారు.