Amit shah on rahul gandhi: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా పై మండిపడ్డారు. దేశాన్ని విభజించేందుకు కుట్ర పన్నుతోన్న శక్తులకు అండగా నిలబడటం రాహుల్‌కు, కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశ వ్యతిరేక ప్రకటనలు చేయడం, దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులకు అండగా నిలవడం రాహుల్, కాంగ్రెస్‌కు అలవాటుగా మారింది. జమ్మూకశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన దేశవ్యతిరేక, రిజర్వేషన్ల వ్యతిరేక అజెండాకు మద్దతు ఇవ్వడమైనా సరే, విదేశీ గడ్డపై భారత్ వ్యతిరేక ప్రకటనలైనా సరే.. ఆయన ప్రతిసారీ దేశ భద్రతను ముప్పులో పడేస్తున్నారు. మనోభావాలను దెబ్బతీస్తున్నారు.
కాంగ్రెస్ వ్యతిరేకతను మరోసారి మనముందుంచారు..
ప్రాంతీయవాదం, మతం, భాష పరంగా చీలికలు తెచ్చే కాంగ్రెస్ రాజకీయాలను రాహుల్ ప్రకటన బయటపెట్టింది అన్నారు. రిజర్వేషన్ల రద్దు గురించి మాట్లాడి.. వాటిపై కాంగ్రెస్ వ్యతిరేకతను మరోసారి మనముందుంచారు. ఆయన మనసులో మెడీలే ఆలోచనలే చివరకు మాటల రూపంలో బయటపడ్డాయి. ఇక్కడ నేను రాహుల్‌కు ఒక విషయం స్పష్టంచేయాలని అనుకుంటున్నాను. బీజేపీ ఉన్నంతకాలం రిజర్వేషన్లను ఎవరూ రద్దు చేయలేరు. అలాగే దేశభద్రతతో ఆటలాడలేరు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
భారత్‌లో ఇప్పటికీ నిష్పక్షపాత పరిస్థితులు లేవు..రాహుల్
అగ్రరాజ్య పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ పలు ప్రసంగాలు చేశారు. ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. రిజర్వేషన్ల గురించి మాట్లాడుతూ.. ” ప్రస్తుతం భారత్‌లో ఆదివాసీలు, దళితులు, ఓబీసీలకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదు. అభివృద్ధిలో వారి భాగస్వామ్యం కూడా అంతంతమాత్రంగానే ఉంది. భారత్‌లో ఇప్పటికీ నిష్పక్షపాత పరిస్థితులు లేవు. ఆ రోజులు వచ్చిన తర్వాత రిజర్వేషన్ల రద్దు గురించి మేం ఆలోచిస్తాం” అని రాహుల్ వ్యాఖ్యానించారు. మీడియా, దర్యాప్తు ఏజెన్సీలతో ప్రజలను ఒత్తిడికి గురిచేసి.. బీజేపీ, ప్రధాని మోడీ భయాన్ని వ్యాప్తి చేశారు. కానీ, ఎన్నికల తర్వాత అదంతా తారుమారైంది. ఇప్పుడు బీజేపీనిచూసి ఎవరూ భయపడట్లేదు. ఇప్పుడు పార్లమెంట్‌లో నేను ప్రధాని ముందుకెళ్లి.. ’56 అంగుళాల ఛాతీ ఇక చరిత్రే’ అని చెప్పగలను” అని రాహుల్ ఎద్దేవా చేశారు. భారత్‌లో అన్ని రాష్ట్రాలు సమానమేనన్న ఆలోచనను ఆర్‌ఎస్‌ఎస్ అర్థం చేసుకోలేకపోతోందన్నారు. అయితే, విదేశీ గడ్డపై రాహుల్ దేశాన్ని కించపర్చేలా వ్యాఖ్యలు చేయడంతో బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు.
Read Also: Tremors In Delhi: పాక్‌లో భూకంపం.. భారత్‌లోని ఆరు రాష్ట్రాల్లో ప్రకంపనలు