Delimitation : తెలంగాణ ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజనపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణలోని అన్ని పార్టీలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ నేత జానారెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాజకీయాలకు అతీతంగా దీన్ని చూడాలని.. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై అందరూ మాట్లాడాలని వారు లేఖలో కోరారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై చర్చించేందుకు రావాలంటూ ఆహ్వానించారు. త్వరలోనే అఖిలపక్ష భేటీ తేదీని, వేదికను ప్రకటిస్తామన్నారు.
Read Also: Dry Eyes : మీ కళ్లు పొడిబారుతున్నాయా? అయితే ఈ చిట్కాలు పాటించండి
జనాభా ప్రాతిపదికన జరగబోయే నియోజకవర్గాల పునర్విభజనతో తెలంగాణకు ప్రమాదం. జరగబోయే నష్టం గురించి అన్ని పార్టీలను ఆహ్వానించి చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఏర్పాటు చేస్తున్న ఈ సమావేశానికి అన్ని పార్టీలు హాజరుకావాలి. ప్రతి పార్టీని ప్రత్యేకంగా ఆహ్వానిస్తామని అన్నారు.
కాగా, కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనను చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని ఇప్పటికే రేవంత్ ప్రభుత్వం వ్యతిరేకించింది. ఎందుకంటే సౌత్ లోని అన్ని రాష్ట్రాలు గతంలో జనాభాను నియంత్రించాయని.. ఉత్తర భారత రాష్ట్రాలు నియంత్రించలేదు కాబట్టి.. ఇప్పుడు ఆ రాష్ట్రాల్లో జనాభా ఎక్కువగా ఉందని రేవంత్ ఇప్పటికే వివరించారు. ఈ లెక్కన జనాభా ఎక్కువ ఉన్న నార్త్ రాష్ట్రాలకే ఎక్కువ సీట్లు వస్తాయని.. పార్లమెంట్ లో దక్షిణ రాష్ట్రాల వాయిస్ తగ్గిపోతుందంటూ చెప్పారు.