Akasha Air : ఆకాశ ఎయిర్, భారతదేశపు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎయిర్ లైన్. ఢిల్లీ నుండి రాకపోకలతో నేరుగా కనక్టివిటీని అందిస్తూ తమ నెట్ వర్క్ కి 28వ నగర గమ్యస్థానంగా దర్భంగా చేరికను ప్రకటించింది. ఇది ఏప్రిల్ 04, 2025 నుండి అమల్లోకి వస్తుంది. ఎయిర్ లైన్ ఢిల్లీ (ఢిల్లీలో విమానం మారవలసిన అవసరం లేదు) ద్వారా హైదరాబాద్ మరియు దర్భంగాల మధ్య విమానాలను రోజు ఆపరేట్ చేస్తుంది. పర్యాటక కేంద్రం మరియు రెండు ప్రధానమైన మెట్రోస్ మధ్య కనక్టివిటీని మెరుగుపరుస్తుంది. ఈ ప్రారంభం ఎయిర్ లైన్ బీహార్ రాష్ట్రంలో ప్రవేశించిడానికి గుర్తుగా నిలిచింది. దేశవ్యాప్తంగా తమ కార్యకలాపాలను శక్తివంతం చేయడానికి ఎయిర్ లైన్ నిబద్ధతను ఇది పునరుద్ఘాటిస్తోంది. ప్రయాణికులు ఆకాశ ఎయిర్ వెబ్ సైట్ www.akasaair.comపై, ఆండ్రాయిడ్ మరియు iOS యాప్ లేదా వివిధ ప్రముఖ ట్రావెల్ ఏజెంట్స్ ద్వారా విమానాలను బుక్ చేయవచ్చు.
Read Also: CM Revanth: సీఎం రేవంత్ మరో సంచలన నిర్ణయం.. వాటిపై ఉక్కుపాదం!
తమ విలక్షణమైన మిథిల కళకు ప్రసిద్ధి చెందిన దర్భంగా, చరిత్ర మరియు సాంస్కృతిక వారసత్వాలు సుసంపన్నంగా నిలిచిన నగరంగా ప్రయాణికులను ఆకట్టుకుంటోంది. తమ రాచరికపు వారసత్వంతో, ఈ నగరం యొక్క వైభవోపేతమైన గతానికి నిరూపణగా ప్రాచీన రాజప్రసాదాలు మరియు కట్టడాలకు నిలయంగా ఉంది. దీని చారిత్రకమైన ప్రాధాన్యతతో పాటు దర్భంగా తన గొప్ప ఆలయాలు, ప్రశాంతమైన సరస్సులు మరియు ఉత్సాహవంతమైన అటవీ జీవితంతో కూడా సందర్శకులను ఆకర్షిస్తోంది. ఢిల్లీ నుండి దర్భంగాకు రోజూ విమానాలను ప్రారంభించడం ఈ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాన్ని మరింత పెంచుతుంది మరియు ప్రయాణికుల కోసం మెరుగైన కనక్టివిటీ ఆప్షన్స్ ను అందిస్తుంది.
ప్రవీణ్ అయ్యర్, సహ-స్థాపకులు మరియు ఛీఫ్ కమర్షియల్ ఆఫీసర్, ఆకాశ ఎయిర్ ఈ ప్రకటన గురించి మాట్లాడుతూ.. “విస్తృతమైన చారిత్రక మరియు సాంస్కృతిక ప్రాధాన్యత గల నగరాన్ని 28వ గమ్యస్థానంగా మా అత్యంత వేగంగా విస్తరిస్తున్న నెట్ వర్క్ కు చేర్చినందుకు ఎంతో ఆనందిస్తున్నాము. ఈ కొత్త మార్గం ప్రాంతీయ కనక్టివిటీని శక్తివంతం చేయడానికి మరియు ప్రయాణికులకు అందుబాటులో ఉంచడాన్ని మెరుగుపరచడానికి మా కట్టుబాటును సూచిస్తోంది. దర్భంగాను ఢిల్లీ మరియు హైదరాబాద్ తో కలపడం ద్వారా, మేము కస్టమర్లకు సకాలంలో, సరసమైన మరియు నమ్మకమైన ప్రయాణ ఆప్షన్స్ ను అందించే లక్ష్యంతో పాటు ఈ ప్రాంతం ఆర్థిక, పర్యాటక వృద్ధికి తోడ్పడుతున్నాము ” అన్నారు.
ఆకాశ ఎయిర్ వారి స్థిరమైన సకాలం నాయకత్వం, కార్యకలాపాల సామర్థ్యాలు మరియు ఎంతో సానుకూలమైన కస్టమర్ ఫీడ్ బ్యాక్ లు భారతదేశంలో ప్రాధన్యత ఇవ్వబడిన క్యారియర్ గా ఎయిర్ లైన్స్ ను నిలిపాయి. ఆగస్ట్ 2022లో ప్రారంభమైన నాటి నుండి 15 మిలియన్ ప్రయాణికులకు సేవలు అందించింది. ఆకాశ ఎయిర్ ప్రస్తుతం 23 డొమేస్టిక్ మరియు అయిదు అంతర్జాతీయ నగరాలను కలుపుతోంది అవి ముంబయి, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, కొచ్చి, ఢిల్లీ, గౌహతి, అగర్తల, పూణె, లక్నో, గోవా, హైదరాబాద్, వారణాసి, బాగ్ డోగ్రా, భువనేశ్వర్, కొల్ కత్తా, శ్రీ విజయ పురం, అయోధ్య, గ్వాలియర్, శ్రీనగర్, ప్రయాగ్ రాజ్, గోరఖ్ పూర్, దర్భంగా, దోహా (ఖతార్), జెడ్డా, రియాధ్ (కింగ్ డమ్ ఆఫ్ సౌదీ అరేబియా), అబూ ధాబి (UAE) మరియు కువైట్ సిటీ (కువైట్).