Site icon HashtagU Telugu

AESL : జెఈఈ మెయిన్స్‌ 2025 ( సెషన్ 2 ) లో తెలంగాణ రాష్ట్ర టాపర్‌గా ఆకాష్

Akash is the Telangana state topper in JEE Mains 2025 (Session 2).

Akash is the Telangana state topper in JEE Mains 2025 (Session 2).

AESL : టెస్ట్ ప్రిపరేటరీ సేవలలో జాతీయ అగ్రగామి అయిన ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ ( ఏఈఎస్ఎల్) ఇటీవల జరిగిన జాయింట్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌ (జెఈఈ) 2025 మెయిన్స్ లో అసాధారణ ప్రతిభను తమ విద్యార్థులు చూపారని వెల్లడించింది. 100 పర్సంటైల్‌ సాధించి హైదరాబాద్ కు చెందిన హార్ష్ ఏ గుప్తా తెలంగాణ రాష్ట్ర టాపర్ గా నిలిచాడు. అతనితో పాటుగా కొత్త ధనుష్ రెడ్డి 99.99 పర్సంటైల్‌ తో అల్ ఇండియా ర్యాంక్ 179 , సంహిత పోలాడి 99.98 పర్సంటైల్‌ తో అల్ ఇండియా ర్యాంక్ 203 , రాఘవన్ ఏపూరి 99.97 పర్సంటైల్‌ తో అల్ ఇండియా ర్యాంక్ 417 మరియు భరత్ నాయుడు కిలారి 99.95 పర్సంటైల్‌ తో అల్ ఇండియా ర్యాంక్ 821 సాధించి తల్లిదండ్రులతో పాటుగా ఇనిస్టిట్యూట్‌కు గర్వకారణంగా నిలిచారు.

Read Also: Rahul Gandhi : సీఎం రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ లేఖ

ప్రపంచంలో అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్షగా భావిస్తోన్న ఐఐటీ జెఈఈలో వీరు సాధించిన విజయం వారు పడిన కష్టం, చూపిన అంకిత భావంకు నిదర్శనం. వీరు ఆకాష్‌ క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ లో శిక్షణ తీసుకున్నారు. విద్యార్థులను అభినందించిన ఆకాష్‌ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ చీఫ్‌ అకడమిక్ అండ్ బిజినెస్ హెడ్ శ్రీ ధీరజ్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ.. ‘‘విద్యార్థులు పడిన కష్టం, అంకితభావం తో పాటుగా సరైన కోచింగ్ తో వీరు అసాధారణ ఫలితాలను సాధించారు. ఆకాష్ వద్ద మేము ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించటం పై దృష్టి సారిస్తున్నాము. తద్వారా వారు తమ పూర్తి సామర్ధ్యం చేరుకోగలరు. విజయం సాధించిన ప్రతి విద్యార్థిని అభినందిస్తున్నాను. భవిష్యత్‌లో వారు మరిన్ని విజయాలను సాధించాలని ఆకాంక్షిస్తున్నాము’’ అని అన్నారు.

Read Also: Job Mela In Madhira: జాబ్ మేళాలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భ‌ట్టి!