African Swine Flu : ఆఫ్రికన్ స్వైన్‌ఫ్లూ కేరళలో కలకలం రేపుతోంది. కన్నూర్ జిల్లాలోని కనిచర్ గ్రామంలో పందుల వల్ల ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ వ్యాప్తి చెందిందని అధికారులు వెల్లడించారు. ఈనేపథ్యంలో అక్కడి రెండు పిగ్ ఫామ్స్ లోని పందులను చంపాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఆ పిగ్ ఫామ్స్ కు 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న పందులను కూడా చంపాలని నిర్దేశించారు. జిల్లా వెటర్నరీ అధికారుల తనిఖీ తర్వాత కన్నూర్‌లోని ఒక కమోడిటీ ఫామ్‌లో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ వైరస్ జాడ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈనేపథ్యంలో ప్రభావిత ప్రాంతంలోని ఫామ్ లలో పంది మాంసం అమ్మకం, పందుల రవాణాపై మూడు నెలల పాటు బ్యాన్ విధిస్తున్నట్టు కలెక్టర్ ప్రకటించారు.
Also read : Vivek Plan Vs Ukraine War : అక్కడ రష్యాను ఓడించకుండానే.. అమెరికాను గెలిపిస్తా : వివేక్
వ్యాధి మరింత ప్రబలకుండా పశువైద్యాధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ (African Swine Flu) సూచించారు. గత రెండు నెలల్లో కనిచర్ గ్రామం నుంచి పందులను ఇతర ఫామ్స్ కు తరలించారా లేదా అనేది నిర్ధారించేందుకు అత్యవసర నివేదిక ఇవ్వాలని స్థానిక అధికారులను కోరారు. ఒకవేళ గ్రామపంచాయతీ పరిధిలో ఎక్కడైనా ఆఫ్రికన్ స్వైన్‌ఫ్లూ కేసులు నమోదైతే.. వెంటనే అధికారులకు తెలియజేయాలన్నారు.
Also read : Tirumala Tiger : అదిగో చిరుత..ఇదిగో కర్ర.! TTDపై నెటిజన్ల ట్రోల్స్, మీమ్స్ హోరు!!